పాఠకులకు నమస్కారం.
అడుగుకు విరామం ప్రకటిస్తున్నాం…..
అడుగు అందించే విలువైన , అవసరమైన బరువైన వ్యాసాలు కాలమ్ లు చదివే ఓపిక జిజ్ఞాస ఉన్న పాఠకులు అంతర్జాలంలో తక్కువున్నారనిపిస్తోంది. ఇంకా అట్టడుగు వర్గాల ప్రజలకు అంత వెసులు బాటు లేదనిపిస్తోంది. అది నిజమో కాదో, రోజు రోజుకీ తక్కువైన స్పందన నిరాశ కలిగిస్తూ వచ్చింది.
అలాగే పత్రికపై మొదట్లోనే సీరియస్ ముద్ర పడడం, రిలాక్స్, రైటింగ్ చేసేవారు ఇటువైపు చేయి వేయకపోవడం కారణం కావచ్చు.
మరో ప్రధాన కారణం సోషల్ మీడియా బహుళ వ్యాప్తిలో ఉన్నందున పాఠకులు తక్షణ స్పందనకు అలవాటు పడిపోయారనిపిస్తుంది. ఫేస్ బుక్ లో పోస్టు పెట్టగానే వచ్చే స్పందన వెబ్ సైట్ లో రాకపోవడంతో రచయితల స్పందన కూడా తక్కువగానే ఉంటూ వచ్చింది.
మొత్తంగా రకరకాల కారణాల చేత …అడుగుకు విరామం ప్రకటిస్తున్నాం.
మళ్లీ అడుగు అవసరం ఉందని పాఠకులు భావించినపుడు ఆలోచిద్దాం.
అంతవరకు సెలవు…
సహకరించిన రచయితలకు, పాఠకులకు అందరికీ ధన్యవాదాలు.
-అడుగు సంపాదక వర్గం.
అరే, అదేంటి?
అడుగు పత్రిక తిరిగి మొదలవ్వాలని కోరుకుంటున్నాను.
మీ మాట ఊరికే పోకూడదని కోరుకుంటున్నాను మేడమ్