Featured కితాబ్

ఆదిమ ఆధునికానంతర  అభివ్యక్తి సంక్లిష్టత జిలుకర కవిత్వం

–   డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి
జిలుకర శ్రీనివాస్‌ విశ్లేషకుడిగా, విమర్శకుడిగా, సిద్ధాంతకర్తగానే నాకు పరిచయం. ఈ కవిత్వం చదివినంక ఆయనలో మంచి కవి ఉన్నడని, ఆయనలో గొప్ప భావుకత ఉన్నదని, కాల్పనిక ఉద్విగ్నత, వినూత్న కల్పనా, నూతన అభివ్యక్తీకరణ శక్తి వున్నవని అర్థమయింది.
తొగు దళితవాద కవిత్వంలో సాంఘిక వివక్షను, అణచివేతను ప్రశ్నిస్తూ గొప్ప ధిక్కార స్వరంతో బలమైన కవిత్వం చాలా వచ్చింది. అదంతా సామాజిక దృక్కోణంలో వచ్చిన కవిత్వం. తాత్విక దృక్కోణం నుంచి వచ్చిన మొదటి సంకలనం ఇదేననుకుంటున్న.
మొత్తం తెలుగు దళిత కవిత్వంలో సంక్లిష్టమైన గొంతుక జిలుకర. ప్రేమ పారవశ్యాన్ని, బౌద్ధంమీది ప్రేమను, దళితు మీది ప్రేమను దళితుడిగా తన అస్తిత్వం మీది ప్రేమను తాత్వీకరించి, ఆర్ద్రీకరించి క్రోధంగా మలిచి ఒక్క రేఖమీదికి తీసుకొచ్చిండు. భిన్న కవితగా కనిపించే ఈ కవిత ఒకే తాత్వికతలోంచి పారే పాయ.
కవిత్వంలోనూ సైద్ధాంతిక రంగంలోనూ జిలుకరతో సీమాంధ్ర పోలిక తేవడం అనవసరం అయినా స్పష్టత కోసం తేక తప్పదు. జాషువ, కత్తిపద్మారావు లాంటివారు తమ జీవితమంతా తమ మీది ముద్రల్ని తొలిగించుకోవడానికి డిఫెన్సు లాయర్లుగానే పోరాడినారు. అందుకు భిన్నంగా అఫెన్సివ్‌గా పోరాడుతున్నవాడు జిలుకర.
ఇది కొత్త దృశ్యం. సైద్ధాంతిక యవనిక మీద మాత్రమే కాక సృజనాత్మక ఆవరణలో కూడానని ఈ కవితలు వ్లెడిస్తున్నవి. ఆగ్రహాన్నీ, ఆర్ద్రతను, ఆలోచనను ముప్పుయిగా పేనిన తాళ్లు ఈ కవితలు. చరిత్రనూ వర్తమానాన్నీ భవిష్యత్తును ముప్పుయిగా పేనిన కవితలు కూడా. చిత్రంగా దళితవాదం ఆదిమ, భూస్వామ్య, ఆధునిక, ఆధునికానంతర మివతో సంబంధాన్ని కలిగివుంది. జిలుకర ఈ నాలుగు పురులను తాడుగా అల్లినాడు. నిజానికి నాలుగు తాళ్లను పేనడం కుదరదు.
క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన బౌద్ధతత్వవేత్త నాగసేనుడి, ఎంప్టీ సౌండ్‌ను, నాగార్జునుడి శూన్యవాదాన్ని, డెరిడా అర్థ అనిశ్చితిని అంటే తాత్విక అనిశ్చితిని మరో ముప్పిరిగా పేనినవాడు జిలుకర.
పురాణ, ఇతిహాసాల నుంచి ఆధునికతకు అభ్యుదయ భావనకు అనుగుణంగా శ్రీశ్రీలాంటివాళ్ళు ప్రతీకను వాడుకున్న విషయం లోకవిదితమే. అందుకు భిన్నంగా దళితవాద కవిత్వం పురాణ ఇతిహాసాలోని పాత్రల్ని తమ దృక్కోణం నుంచి వ్యాఖ్యానించింది. మిత్స్‌ను తిరగేసి, మల్లేసి, ఉతికి ఆరేసింది. ప్రసిద్ధమైన భావనను వినిర్మాణం చేసింది. చరిత్ర పునర్నిర్మాణ ఆవశ్యకతను ఎలుగెత్తి చాటింది.
జిలుకర ఈ విధానాన్ని కొనసాగిస్తూనే వర్తమానంతో అనుసంధానం కాగ ప్రాచీన పాత్రల్ని పాజిటివ్‌గా మందుకు తెచ్చిండు. కమ్యూనిజాన్ని దృశ్యమానం చేయటానికి మార్క్స్‌ ఆదిమ కమ్యూనిజాన్ని పోలిక తెచ్చినట్టు, అబ్రాహ్మణీయ మానవీయ సమాజాన్ని దృశ్యమానం చేయటానికి బుద్ధుడిని, అసంగుడిని, ధర్మకీర్తిని, ఆనందున్నీ, మాతంగ కశ్యపుడిని, ఉపాళి, నాగార్జునుడు, సుభద్రుడు, సుగతును ముందుకు తెచ్చిండు. తెలుగు కవిత్వంలో ఇది తొలి ప్రయత్నం అనుకుంట. కేవలం పాత్రుగా తీసుకోవటం కాకుండా బౌద్ధం నుంచి ప్రేరణ పొందిండు. బౌద్ధ భావనను స్వీకరించిండు. జిలుకర బౌద్ధాన్ని తన కవిత్వంలో అనేక సందర్భాలో ఆవాహన చేసిండు కాబట్టి ముందు బౌద్ధాన్ని గురించి కొంత చర్చించాల్సి  ఉన్నది.
బౌద్ధం మీద వైదిక మతం విజయం సాధించినంక, కొందరన్నట్లు బౌద్ధాన్ని భారతదేశం నుంచి తరిమేసినంక మళ్లీ బౌద్ధం మీద చర్చ జరిగింది దళిత సందర్భంలోనే. భాగ్యరెడ్డివర్మ బౌద్ధం గురించి కొంత ఆలోచన చేసిండు. అంబేద్కర్‌ తన చివరిదశలో బౌద్ధమతంలో చేరిండు. క్రైస్తవం కన్నా, ఇస్లాం కన్నా, మార్క్సిజం కన్నా బౌద్ధం తన ఆలోచనకు సన్నిహితంగా ఉన్నందువ్ల అలా చేసిండు. తాను ఏ వర్ణకు వ్యవస్థనైతే నిర్మూలించడానికి నడుంకట్టిండో, అదే వర్ణకు వ్యవస్థని బుద్ధుడు తుంగలో తాత్వికంగా నిర్మూలించ పూనుకున్నాడు కాబట్టే అంబేద్కర్‌ను బౌద్ధం ఆకర్షించింది.
కొందరు మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని మిళితం చేయడానికి ప్రయత్నిస్తే, జిలుకర బౌద్ధాన్నీ అంబేద్కరిజాన్నీ సంయోజన చేయడానికి ప్రయత్నించిండు. తన కవితలో బౌద్ధాన్ని పదేపదే పలవరించిండు.
భాగ్యరెడ్డివర్మ, అంబేద్కర్‌ నుంచి జిలుకర దాక బౌద్ధం పట్ల ఎందుకు ఆకర్షితుయ్యిండ్రు? అది మానవీయ మతమయినందు వల్ల.  ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’ అని చెప్పినందువల్ల.  అమానవీయమైన వైదిక మతాన్ని తిరస్కరించినందు వల్ల.  ‘బౌద్ధం మతసంబంధమైన ధర్మశాస్త్రం కాదు. అది ఒక మార్గం. సమగ్ర మానవ జీవితానికి సంబంధించి వెలిసిన వాదం’ అయినందువల్ల.
విశ్వ కేంద్రం నుంచి దేవుణ్ని తప్పించి ఆ స్థానంలో మానవుణ్ని నిలబెట్టి మనిషి ముఖ్యం అన్నడు బుద్ధుడు. ప్రాకృతిక శక్తుల సహాయం వల్ల ఈ విశ్వం నడుస్తుంది తప్ప దాన్ని నడిపే దేవుడంటూ లేడని అన్నడు. ఈ ప్రపంచానికి ఆధారమైనది, ఆశ్రయమైనదీ  ఏదీ లేదని అన్నడు. ఈ ప్రపంచం సర్వ సమృద్ధం, సర్వ స్వతంత్రం. తనకు తానే ఆధారమైనట్టిది. దీని వెనక మానవాతీతమైనదేదీ లేదని బౌద్ధం అన్నందువల్ల ఇలాంటి అనేక కారణాలున్నవి. అందరికీ ఇవి తెలిసినవే. ఈ ప్రపంచం నిత్య పరివర్తితం, అంటే అనుక్షణం మారుతూ ఉంటుంది అని. బౌద్ధం పట్ల వీరి ఆకర్షణకు ఇవి కారణం కావొచ్చు.
బౌద్ధం నుంచి ప్రేరణ పొందుతున్నాడని, బౌద్ధాన్ని ఆవాహన చేసుకుండని అనేక కవిత బట్టి తొస్తుంది. బౌద్ధతత్వవేత్త అయిన ధర్మకీర్తి, ఆనందుడు గురించి కవితల్లో విస్తారంగా చర్చిస్తాడు.
బ్రాహ్మణ్యం ఛీత్కరించిన అస్పృశ్యులను తెల్లని వస్త్రంలేని, మెరిసే నగలేని, కస్తూరీ గంధం పులుముకోని అస్పృశ్యును అక్కున చేర్చుకొని
‘నీకులంతో పనిలేదు నా దప్పిక తీర్చే జల మొసగమ’న్న ఆనందుడిని తనివి తీరా వర్ణిస్తాడు.
ఆ అమృతవాక్కు ఆ సత్యవాక్కు ఎంత నిజం
ఎడతెగని ఆకాశమంత నిజం
పూచేపూలంత నిజం
వీచేగాలంత నిజం
అంతటి నగ్న సత్యాన్ని తొలిసారిగా చెప్పిన సమతా రూపుడు 
ఆనందుడేగా 
ఆ ఆనందుడి తర్వాత అలా అక్కున చేర్చుకున్న జాడ ఎక్కడా ఎప్పుడూ కనరానందున 
‘ఇప్పటికీ ఇక్కడ ఆనందుడి కోసం
మన జాతి వనితలెదురు చూస్తూనే వున్నారు’ అన్నడు.
ఇక్కడొక మార్మికత ఉన్నదా? వచ్చావు కదా ఆ సత్యార్థిని అనే మాటు అందుకు ఆస్కారం కలిగిస్తున్నవి. మార్మిక కవిత్వం లేదా మధురభక్తి కవిత్వం వెనుక ఒక సామాజిక బీభత్సం ఉన్నది. దాన్ని కనుమరుగు చేయటానికి ప్రజల్ని పాసివ్‌ లేదా సబ్మిస్సివ్‌గా చేయటానికి మధుర కవిత్వం వచ్చింది. ఆ బీభత్సాన్ని బట్టబయలు చేయడానికి అంటే ఫైర్‌అప్‌ చేయడానికి గమ్మత్తుగా సరిగ్గా అదే మిస్టిక్‌ పద్ధతిని ఎంచుకన్నాడు జిలుకర.
ఈ కవితల్లో ప్రస్తావించిన మాతంగ కాశ్యపుడు, సుభద్రుడు, ఆనందుడు, ప్రకృతి చారిత్రక వ్యక్తు. బుద్ధుని శిష్యు. ఇంకా, అసంగుడు, ధర్మకీర్తి, నాగసేనుడు, సోమదేవుడు, నాగార్జునుడు లాంటి ఎంతోమంది బౌద్ధ తాత్వికును జిలుకర ప్రస్తుతిస్తాడు.
శ్రీశ్రీ మొదలు శివసాగర్‌ దాకా పౌరాణిక ప్రతీకను భిన్న అర్థాల్లో అభివ్యక్తం చేసిండ్రు. వాళ్లు ప్రాచుర్యంలో వున్న ప్రతీకనే తీసుకుండ్రు. జిలుకర తొలిసారిగా చాలా మందికి పరిచయం లేని అనేక ప్రతీకల్ని ప్రవహింప చేసిండు. బౌద్ధ వాతావరణాన్ని ప్రచలితం చేయడానికి, పునర్‌ ప్రతిష్టించడానికి అలా చేసిండు. వర్తమానం గతంతో సంభాషించడానికి సార్థక ఉదాహరణ ఇది. ఆనందున్ని ఎక్కువగా ప్రస్తావించిండు. ఆనందుడు బుద్ధుని అభిమాన శిష్యుడు. బుద్ధుని ఉపన్యాసాలను, ఆయన చెప్పిన గాథను విని, వాటిని సుత్తపిటకాల్లో పొందుపరిచిన వాడు. అంత ప్రాధాన్యత ఉన్నవాడు గనుక చరిత్రకారులు ఆయనను క్రైస్తవంలోని సెయింట్‌ జాన్‌ లాంటి వాడని ప్రస్తుతించారు.
శైవ, వైష్ణవ, సూఫీ తదితరు ఆదరణనంతా అస్పృశ్యులో మావాళ్లే అందుకున్నరు. భక్తి ఉద్యమ ఫలితాను, సంఘసంస్కరణ ఫలితాను, ఆధునికమైన భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్‌, గాంధీ ఫలితాలు కూడా మాదిగ దాకా చేరలేదు. జిలుకర చారిత్రక దృక్పథం అంబేద్కరిజం పునాదు మీద నిర్మాణమైంది.
హిందూమతంగా చెలామణి అవుతున్న వైదిక మతం, వర్ణవివక్షా అమానుషత్వాన్ని సమర్ధించిన బ్రాహ్మణమతం, వైదిక మత ధిక్కారానికి సాహసించారనీ, నాగార్జునుడు, నాగసేనుడు, అసంగుడు, దిఙ్నాగుడు, ధర్మకీర్తి, సోమదేవుడు, ఆర్యదేవుడు నడయాడిన నేను ఓడిరచినారని, ఫలితంగా ‘రాజ్యాన్ని ధమ్మాన్ని పోగొట్టుకున్న నాగును అంటరానివాళ్లను చేస్తే కృష్ణానది నల్లగా మారిపోయింద’ని, అందువల్ల ఇది అంటరాని భూమి అయ్యిందని ‘అంటరానిభూమి’ కవితలో అంటాడు.
దళితత్వానికి, దక్షిణ భారత మూలవాసికి, బౌద్ధానికి, నలుపు రంగుకు అభేదాన్ని ప్రకటిస్తాడు. నాగజాతికి, అనార్యుకు, దళితులకు కూడా అభేదాన్ని ప్రకటిస్తాడు. అది నిజమే. నాగజాతి దక్షిణాదిలో ఈ కవితా సందర్భంలో తెంగాణాంధ్రలో నివసించిన ఆర్యపూర్వ అనార్య జాతి. ఆర్యు దాడిలో అది ఓడిపోయి కొందరు, లొంగికొందరు, లొంగక కొందరు, సమ్మిశ్రణం చెంది కొందరు భిన్న పాయుగా ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు. అందులో దళితులు ఒకరు. అలా ఓడిన జాతులు ఆర్య సంస్కృతిలో ఓడిన ప్రతీకలుగా ఎట్లా మారినారో కోశాంబి అనేక ఉదాహరణలిస్తాడు. విష్ణువు పడకగా పాము అలాంటి ఒక ఉదాహరణ. గణపతి వాహనంగా మూషికం (ఇది ఒక అనార్య జాతి), గరుత్మంతుడు (గద్దజాతి ఒక అనార్య జాతి) అలాంటిదే. దీన్నంతటినీ ఈ కవితలో నిక్షిప్తం చేసిండు కవి.
ఈ సిద్ధాంతాన్ని ‘వొదుం’ అనే కవితలో మరింత విస్పష్టంగా ప్రకటించాడు.
కూలిన హరప్పా గోడమీద మా పూర్వీకు రాసిన రాత సాక్షిగా
ఈ దేశమట్టి మా నెత్తుటి వారసత్వం
నే పొరల్లో దొరికిన బొక్క సాక్షిగా మీరు హంతకున్నది నిజం
మాతాత బోధిసత్వున్ని బువ్వలో విషం కలిపి కడతేర్చారు
మీ అబద్ధపు తత్వాన్ని నిలదీసినందుకు మా చార్వాకును సజీవంగా పునాదుల్లో పూడ్చేశారు
సత్యం మెగులో బుద్ధ రాజ్యం నిర్మించిన మా బృహధ్రద మౌర్య చక్రవర్తిని
మీ కుట్ర ఖడ్గంతో ఉత్తరించి రాజ్యం దొంగిలించారు.
నెత్తురోడిన మా తల్లి నే సాక్షిగా ఇక్కడే మా రాజ్యం నిర్మించుకుంటం
హరప్పా గోడమీది లిపిని ప్రతిగుండె శిఖరం మీద లిఖిస్తం’’ అంటాడు.
ఈ కవితతో పాటు మతోన్మాది మోనోలాగ్‌, హింసోపనిషత్‌ కవితల్లో కూడా హిందూత్వం తనకు లొంగని వాళ్లను ఎట్లా నిర్మూలించిందో గొప్పగా చెప్పిండు.
బుద్ధుడు నడిచిన చోట
మనువును ఊరేగిస్తూ మీ పయనం
రాజగృహం నుంచి వచ్చిన రాజ్యాంగాన్ని చింపేసి
మనుషును జంతువుగా వర్గీకరించిన మనుస్మృతికి 
పట్టం కట్టాని మీ కుట్ర ` అంటూ ‘అంబేద్కర్‌ను బెదిరించిన’ విషయాన్ని,  శివాజీని అవమానించిన విషయాన్ని, బసవన్నను, రవిదాసు గురును, వర్తమానంలో క్బుర్గిని చంపిన విషయాన్నీ, చర్చీ మీద దాడి చేసిన విషయాన్నీ, ‘‘మీ మొహమ్మీద మా గుడ్డి ముసల్ది తుపుక్కున ఉమ్మేస్తుంద’’ని ఆవేశంతో ముగిస్తాడు.
ముస్లిం మీద హిందూత్వ దాడిని, దళితు మీద దాడిని రెండు పాదాల్లో అద్భుతంగా చెప్తాడు.
నెవొంక నిర్మూన కావ్యరచన
మహా ఆదిజాతి విధ్వంస పథక రచన ఫలితంగా ముస్లిం వీధుల్లో ఆడిపాడే కోరమీసపు సోయగం కనిపించకుండా పోతుంది అంటాడు. ముస్లిం మీద దాడినీ, బీభత్సాన్నీ పికాసో లాగా సర్రియలిస్టిక్‌గా దృశ్యీకరిస్తాడు. ముస్లిం పట్ల ఆత్మీయతను, వారిమీద దాడిపట్ల ఆగ్రహాన్నీ ప్రకటిస్తాడు.
గుజరాతు గాయంతో రోదించావుగా
అల్లా ఇకనైనా 
నోరు తెరుస్తాడో అడుగు అంటూ ముస్లిం ఛాందసవాదం వారిని రక్షించజాదని ప్రకటిస్తాడు. దళితుతో పాటు ముస్లిం సమస్యకు కూడా అంబేద్కరే పరిష్కారమంటూ
సరిగ్గా నీ రూపమే చూస్తూ ఉంటాను
బాబాసాహెబ్‌ నవ్వుతూ మెతురు మెతుకు గోముగా తినిపిస్తాడు అంటాడు. అంబేద్కరంటే అంత విశ్వాసం. అంత ఆరాధన కవికి. అందుకే
నువ్వొక అనంత ఆకాశానివి
నువ్వొక మహాకావ్యానివి
అసు నువ్వే ఒక మహావిశ్వానివి బాబాసాహెబ్‌ అంటాడు.
అంబేద్కర్‌ను మార్క్సిస్టు లిబర్‌ బూర్జువా అన్నారు. యూరోపియన్‌ కాంటెక్స్‌ట్‌లో 18,19 శతాబ్దాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి ఆధునిక సమాజం ఏర్పడటానికి లిబర్‌ బూర్జువాు పాసివ్‌ రోల్‌ ప్లే చేసినందువల్ల అప్పుడా పదం ప్రగతిశీలతకు సంకేతం. ఇప్పుడది తిట్టుపదం. అందుకే జిలుకరకు చాలా ఆగ్రహాన్ని కలిగించింది.
మార్క్సిస్టును ఎర్రమనువు అనగలిగేటంత ఆగ్రహం కలిగించింది. మనువు నీడ కూడా సోకగూడదని చిక్కటి అడవుల్లోకి వెళ్లిపోతే ఎర్రమనువు ఎగరేసుకుంటూ, అక్కడికి రానేవచ్చాడని ఎకసెక్కంగా అంటాడు. దళితవాదం రాకముందే విపశ్యన కవు 1986 ప్రాంతంలోనే ‘మార్క్స్‌ నువ్వు మనువు పీఠమయ్యావా’’ అని ప్రశ్నించిండ్రు.
ఇది అతివాదమా? ఆవేశమా? ఆవేదనా? అనేవి పక్కన పెడితే, జిలుకర మాటల్లో సుదీర్ఘ చరిత్ర ఉంది.
మనదేశంలో నాగరికత మూడు దశలుగా సాగింది. ఆదిమ నాగరికత, ఆర్యనాగరికత, ఆధునిక నాగరికత. ఆదిమ నాగరికత కలిగిన గిరిజనులు అంటే అనార్యు. ఆర్యనాగరికతను తిరస్కరించి, ధిక్కరించి, ఎడమకాలితో తన్నేసి దానికి దూరంగా అడవిలోప తమను భద్రపర్చుకున్నారు. వేల సంవత్సరాలుగా ఆర్యులు ఛేదించలేని దుర్భేద్య చట్రంలోకి మావోయిస్టు ప్రవేశించారు. ఆర్యులు సాధించలేని దానిని, వీళ్లు సాధించిండ్రు. సాధిస్తున్నారు. మరోవైపు ఎన్జీవోలు (ఇందులో హిందూత్వ, బూర్జువా, మార్క్సిస్టు భావజాలా వారున్నారు) అదే పని చేసినయి. అది మంచా? చెడా? ఆర్యచట్రాన్ని, ఆధునిక చట్రాన్ని అక్కడ ప్రవేశపెడుతున్నరు.
గిరిజనులను ‘ఆధునికత’లోకి తేవడానికి (అందులో వ్యాపార, పారిశ్రామిక ప్రయోజనాున్నవి) ప్రభుత్వాు, ఎన్జీవోు విఫమయిన చోట ఆ పనిని మావోయిస్టు ` (వీరి ఉద్దేశం, క్ష్యం వేరైనా) చేస్తున్నందుకు సంతోషించి ఆమేరకు వాళ్లను ప్రభుత్వం (చట్రం), సామ్రాజ్యవాదం ఆమోదించినవి, అనుమతించినవి. తమ అదుపు తప్పినప్పుడు వాళ్లను నిరోధించే పనే ఎన్‌కౌెంటర్లు. చట్రం ఎంత తెలివైనదంటే, చట్రానికి బద్ధ వ్యతిరేకులైన కమ్యూనిస్టును చట్రంలో బిగించింది. బిగిస్తున్నది. బిగించటం మీకాని చోట ఎక్స్‌క్లూజన్‌ పాసీని అవంబిస్తున్నది. దాని ఫలితమే ఎన్‌కౌంటర్లు. తాము దేనికోసం పోరాడుతున్నారో, తద్వ్యతిరేక ఫలితానికి, పాకు ప్రాయోజిత కార్యక్రమానికి లోనవుతున్నారు. ఇంత చరిత్రను జిలుకర రెండు లైన్లలో వ్యక్తం చేసిండు. దీనివ్ల జిుకర ఆశించేదేమిటి? గిరిజను (ఎవరైనా సరే) ప్రభుత్వ, ప్రభుత్వేతర ప్రాయోజిత ప్రాజెక్టుకు లోనుగాకుండా స్వతంత్రంగా తమ దశనూ దిశనూ తామే నిర్ణయించుకోవాని. ఇది ఆధునికానంతర కోణం.
ప్రేమ కవిత్వంలో జిలుకర కవిత కొత్తసాలు ప్రేమను, సామాజికతను మేళవించడం అది. పాస్తీనా కవిత్వంలో ప్రేమను వ్యక్తి ప్లేన్‌ నుంచి సామూహిక ప్లేన్‌లోకి తీసుకెళ్లిండ్రు. ‘‘పాలస్తీనా, నా కన్రెప్పల్ని కర్చీఫ్‌గా నేనిస్తా, నీ కన్నీళ్లను తుడవడానికి’’ అని పాలస్తీనాను ప్రేయసిగా సంభావించి అంటాడు ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌. అది జాతి మూకం. జిలుకర కవిత్వంలో అది సామాజిక మూకం అయ్యింది.
‘కు కాలిపోయేచోట మురికినీరు మాత్రమే నరాల్లో పారేచోట ఎలాగో అలా బతికేయటం నాకు నచ్చదు.
మెరుపున్న చోటు నీ మురిపా నవ్వున్న చోటు ఆకాశంలో తెల్లని మల్లె వొంకున్న చోటు నీ సమస్తమూ ఒకేఒక దివ్య మెగైన చోటు కోసం వెతుకుతూ నువ్వు నడిచిన దారిలో కాంతులీనుతూ  ఉంటాను’… అంటాడు ఒక కవితలో.
‘కుం కత్తుకు రాలిపడిన కోట్ల కొద్ది స్వప్నాలు ఎండిపోతాయి’, ‘నా దగ్ధ లోకం మీద నువ్వు విసిరిన నవ్వు తునుక ప్రేమ’. ఇది రొమాంటిక్‌ ఏజ్‌ ప్రేమకాదు. సోషల్‌ లవ్. ఆధునికమైన ప్రేమను వెనక్కి తీసుకెళ్లే ‘కుపాలికా ప్రణయం’ కాదిది. అనాది ఆత్మీయతను ఆత్మతర్పణను, ఆధునికమైన ప్రణయతత్వంలో సమ్మిళితం చేయడం సూపర్బ్‌.
ప్రేమ కవిత్వంలో కొత్త దృక్కోణం ఇది. మామూలు ప్రేమ కవిత్వం వ్యక్తినిష్ఠం. ఇక్కడ సామాజిక జీవితంలో కోల్పోయినదాన్ని, ఏర్పడిన శూన్యాన్ని, ప్రేమరాహిత్యాన్ని, నిరంతర ఎడారి పయనాన్ని చూపిస్తడు. ఒక చెలిమెలో ఒక చెలిలో సేదతీరడం ఇది. ప్రేమకవిత్వంలో అత్యంత కొత్త అధ్యాయం ఇది. అధునాతన అధ్యాయం ఇది. సామాజిక స్వర జిలుకరకూ ప్రేమమయ స్వర జిలుకరకూ ఎంత వైవిధ్యం?
ఈ సంకనంలో స్త్రీ చుట్టూ తిరిగే కవితలు చాలా ఉన్నవి. ఈ స్త్రీ ఎవరు? వాచ్యార్థంలోని స్త్రీయా? ప్రేయసా? తనలో రగిలే ఒక వాంఛా? తాను పొందాల్సిన ప్రేమ మూర్తా? వజ్రయానం ప్రకారం నిర్యాణం చెందడానికి అడ్డంగా వున్న భోగాభిలాషను అణచివేయడం ద్వారా కాక అనుభవించడం ద్వారా దాన్నుంచి విముక్తి చెంది నిర్యాణం చెందాలన్నట్టు, పూర్తి సామాజికుడు కావడానికి అడ్డంగా ఉన్న వాంఛను అనుభవించడం ద్వారా తొగించుకొని స్వచ్ఛతను పొందడమా? స్వేచ్ఛను పొందడమా? ఎట్లా అర్థం చేసుకోవాలె? జిలుకర ప్రేమ వ్యక్తిగతమైంది కాదు. ప్రేమపూరితమైన సమాజాన్ని నిర్మించటం ద్వారా సంఘంలోని అసమానతను తొగించాన్న ఆశకు ఉన్నతమైన వ్యక్తీకరణ అది.  ప్రేమను కుం ఖండిస్తది. అవసరమైతే భయంకరమైన హింసకు కువ్యవస్థ పాల్పడుతది. అలాంటి వ్యవస్థలో ప్రేమ భావనను నాటడం ద్వారా మార్పు తీసుకురావటం జిలుకర ఆలోచనేమో. బుద్ధుడు కోరింది అదే కదా.
ఇంత మోహావేశంతో, కాల్పనికతతో, ఇమాజినేషన్‌తో కలవరించే సావకాశం దళితుడికెక్కడిది? రొచ్చుగుంటలో అస్పృశ్యతా పరిహాసా ‘అసుంట అసుంట’ అవహేళన మధ్య తిండికోసం, కనీస గౌరవం కోసం పోరాడే దళితుడికి ఒక కృష్ణశాస్త్రిలా ఒక శేషేంద్రలా ఒక పెద్దనలా రస సామ్రాజ్యంలో విహరించే సావకాశం దళితుడికెక్కడిది? ఇంత ఇమాజినేటివ్‌గా అభివ్యక్తీకరించే శక్తి దళితుడికెక్కడిది? అలాంటి శక్తి ఆ కవుకు మించి ఉందని అనేక కవితల్లో నిరూపించిండు.
తొగు కవిత్వంలో తాత్వికత రీత్యానే కాక అభివ్యక్తి రీత్యా కూడా జిలుకర భిన్నమైన కవి.
ఎంత వికారంగా ఉన్నదీ వెన్నెల
ఈ చంద్రుడింత మసక బారిపోయాడేమి అంటాడు. వెన్నెను ఇలా నెగిటివ్‌గా చెప్పడం అరుదుగా చూస్తాం. బహుజన సిద్ధాంతానికి ప్రతీకగా తీసుకుంటే తప్ప ఈ నెగిటివ్‌ వర్ణన సార్థకత అర్థం కాదు.
‘ఏ సౌందర్యాగ్ని ముందూ చలికాచుకోవద్దు అంటే
ఢిల్లీ వీధుల్లో ఒంటిమీద స్వెట్టర్‌లేని ముసలాడిలా ఉంది యవ్వనం’ అంటాడు.
సౌందర్యాన్ని పువ్వుతోనో, వెన్నెలతోనో పోలుస్తరు. అగ్నితో పోల్చడం కొత్తది. సౌందర్యం మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తది. శరీరానికి వేడినిస్తదా? మానసికశక్తి భౌతికశక్తిగా మారడమంటే ఇదే.
జిలుకర కవిత్వంలో అద్భుతమైన ఇమేజెస్‌ ఉన్నవి. తొలినాటి విప్లవ కవిత్వం మీద ఉన్నట్టే, దళిత కవిత్వం మీద కూడా ఒక ఆరోపణ ఉన్నది. అది ఒట్టి సిద్ధాంత కవిత్వం, శుష్కవచనం, వాచ్యం అని. దీనిని ఈ కవి పూర్వపక్షం చేసిండు.
మెతురు రేకు గీసుకున్నానో లేదో
చీకటిని కుండకొద్ది ఆకాశం మీద గుమ్మరించి వెళ్లిపోయావు
మంచుశిఖరాలను దాటి పూతోట సమీపించానో లేదో
అన్ని పర్వతాను ఎదలో నాటిపోయావు
అమృత ద్రాక్షను వెతుకుతూ అరేబియా ఇసుక సంద్రాన్ని చేరానో లేదో
ఆశకు ఆంక్షలు విధించి ఎండమావులను  వాకిలిలో పారేసి పోయావు
కొత్త అభివ్యక్తికి మరో ఉదాహరణ.
నీ పెదవి విరుపులైనా పర్లేదు
అవి విసిరే తుపాకీ తూటాలు తాకినా పర్లేదు
నీకంటి కింది ఎర్రని చారు నా ఎదమీద భగ్గున మంటపెట్టినా పర్లేదు
చేసిన నేరానికి ఎలాంటి విచారణ లేకుండానే
నీ పాదాల కింద పాతిపెట్టినా పర్లేదు
నీ మాటలు విని నిన్ను అతి దగ్గరగా చూడాలనే వచ్చాను అంటాడు.
ఉర్దూ, ఫారసీ గజళ్ళలో ప్రేయసి సాన్నిహిత్యాన్ని ఆకాంక్షించే ఛాయ ఇందులో తపించినా ఆ కవిత్వాన్ని మించి ఉన్నది పై కవితలోని మూడో పాదం. గజళ్లలోని ప్రేయసి కరుణను కూడా అంగీకరించే బేలతనం ఈ కవితలో లేదు.
జిలుకర ఎంత సంక్లిష్ట సిద్ధాంతాన్ని ప్రతిపాదించగడో, దాన్ని ఎంత సరళంగా వివరించగడో కవిత్వంలో అతి సంక్లిష్టమైన ఇమేజ్‌ వెయ్యగడు అనడానికి ఉదాహరణలు ఈ సంకనంలో చాలా వున్నాయి.
ఈ రాత్రి వెన్నెల నల్లని కొండమీద వాలిపోయింది
పొరు పొరుగా విప్పుకున్న దానిమ్మ ముడతు చితికిపోయాయి
ఎన్ని చీకటి యుగా వెచ్చటి కోర్కె
ఎన్ని మోహగీతా కుండపోత
చిలిపికళ్ల పిల్లా
బతుకులో బొత్తిగా సొగసు లోపించింది
కళ్ళలో పూర్తిగా తీపి స్కనం నీరసించింది
పనిలో నువ్వు
పరుగుతో నేను ఇలా మొద్దుబారి పోయాం అంటాడు.
దళితు యుగాలుగా కోల్పోయిన భౌతిక జీవన సౌఖ్యాలను, దుర్భర దారిద్య్రాన్ని అణచివేతను అవమానాలన్ని అనేక కవితలు తెలుగు సాహిత్యంలో చిత్రిక పట్టినవి. దాని కొనసాగింపుగా లేదా భిన్నంగా యుగాలుగా కోల్పోయిన ఈస్థటిక్స్‌ని అద్భుతంగా చెప్పిండు జిలుకర ఈ కవితలో.
ప్రతీకలు, ఇమేజేస్‌, కొత్త పోలికలు చాలామటుకు దళిత జీవితం నుంచి తీసుకున్నవి. మరో రకంగా చెప్పాంటే దళిత దృక్కోణం నుంచి రాయడం – వెన్నెలను కొత్తపోలికతో – వల్లే కొత్త పోలికు, ప్రతీకలు, ఇమేజేస్‌ రావడం సాధ్యమైంది. వస్తువు మారినప్పుడు దానికనుగుణంగానే రూపం రూపొందుతుందన్న సిద్ధాంతానికి ప్రబల నిదర్శనం జిలుకర కవిత్వం.
ఈ షిఫ్టు ‘బహువచనం’ నుంచి మొదలయ్యింది. దానికి తాత్విక పరాకాష్ట జిలుకర కవిత్వం.  ఆధునికానంతర అభివ్యక్తి ఈయన కవిత్వంలో కనిపిస్తుంది.
సెల్‌ఫోన్‌ చెవుకు సిగ్గులేక ఇంకా బతికి వుంది కానీ ఈ పాటికి ఎప్పుడో స్క్రాప్‌లోకి దూకి చచ్చిపోవాలి అంటాడు.
ఆధునికానంతర సంక్లిష్ట అభివ్యక్తి ఆధునికతకు భిన్నం. భూస్వామ్య వ్యవస్థలోని సరళత, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో క్లిష్టతగా మారింది. ఆధునికానంతర వ్యవస్థలో సంక్లిష్టతగా మారింది. జీవితంలోని సరళత, క్లిష్టత సమ్మేళనం కనిపిస్తది. సంక్లిష్టత కవితాభివ్యక్తిలోకి అనువదితమయింది. ‘‘కాఫ్కాలా నేను’’ లాంటి కవితల్లో జక్స్‌టపోజ్‌ అనేది తాత్విక, కవిత్వ నిర్మాణ పద్ధతి. దీనిని కవి సమర్ధవంతంగా వాడుకున్నడు. ఈ సంకనంలో నాకు నచ్చిన గొప్పకవితు ఆఖరి కవిత, నెమలికళ్లు, పరుసవేదివి, నువ్వు జ్ఞానివి నేను అజ్ఞానిని, కాఫ్కాలా నేను, పవిత్ర చరణాలు, ఎఫ్‌.ఐ.ఆర్‌… ఇంకా చాలా వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)