షాయరీ

గోడలు

స్మశాన వైరాగ్యాన్ని తలపింపజేస్తూ
నిర్లిప్తపు స్థబ్ధతలో నిలబడివున్నా
ఆ గోడలను పునాదులతో సహా
నేలమట్టం చేసేద్దాం రండి.
గోడలు కూలిన చోట
ఒకరి లోతులనొకరం కాసేపు తవ్వుకుని
అక్కడెక్కడైనా మానవత్వపు అవశేషాలు
మిగిలున్నాయేమోనని శోధించుకుని
దొరికిన పిడికెడు స్నేహాన్ని
తలో చిటికెడు పంచేసుకుందాం రండి.
వీలైతే సమిష్టి గోడనొకటి నిర్మించుకుందాం
ఏ దేహాలు శిలువేయబడని గోడని
ఏ రంగులు పులుముకోని గోడని
ఏ భావోద్వేగాల మకిలి అంటుకోని గోడని
ఉన్మాదోన్మత్త దుమ్ము నిండుకోని గోడని
వైరుద్ధ్య భావపరంపరల్లో కూడా
మానవత్వాన్ని ఏకతాటిపై నిలపగలిగే గోడని
వాదనలన్నింటినీ చీల్చుకుని ధైర్యంగా నిలబడే గోడని..
– శతపత్ర
29/12/17

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)