షాయరీ

చాలాసార్లు

మనకు మనంగా ఎదురువెళ్ళొద్దు
జీవితంలోకి. ఉక్కపోస్తున్నా వున్న
నిశ్శబ్దంతోనే వుండిపోవాలి. లేని
క్షణాల్ని వూహకు మాత్రం పరిమితం
చేసి చప్పరించాలి.

మోయాలి విసుగుల్ని. భరించాలి
ముసుగుల్ని. అంగీకరించాలి,
ఇట్నుంచి అటుకన్నా అట్నుంచి ఇటు
దూరం ఎప్పుడూ ఎక్కువని. నమ్మాలి,
మార్గమే మార్గం చూపుతుందని.

ఓపిక ఓడిపోయి మార్పుకోసం కంకణం
కట్టుకు బయల్దేరావా? కొత్త మలుపు
చివరెప్పుడూ విషాదమే అని
పాత మూర్ఛబిళ్ళొకటి
మరోసారి మెళ్ళోపడ్తుంది!

– మోహన్ రుషి
83417 25452

One thought on “చాలాసార్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)