షాయరీ

జాస్మిన్

********

రాత్రి కలలోకి వచ్చావు
సాదా సీదాగా మంచినీటి బిందువు మల్లే !

కార్పొరేట్ మేకప్పుల్లేని
కడిగిన మెరుపు మల్లే !

వెలుతురింకా విచ్చుకోకముందే
ఉదయిస్తున్న మంచు పువ్వు మల్లే !

మైల యింకా తుడవని
పసిపాప తొలినవ్వు మల్లే !

రాత్రి కలలోకి వచ్చావు
కలను వీడని నీడమల్లే !
సముద్ర తీరానికొచ్చాను
నీతో
కేరింతలాడిన ఆ కెరటాలను

సా
రి
చూద్దామని…

నీ
పాదాలను తాకి
శుభ్రపడిన ఆ అలలను

రో
సా
రి
చూద్దామని…
ఆ సముద్ర తీరానికొచ్చాను.

                    -జుగాష్ విల్లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)