Featured కాలమ్స్

పదాల వెతుకులాట…

                                                                                                                       -సడ్లపల్లె చిదంబరరెడ్డి.

                                       

                               పదాల వెతుకులాట

కర్నాటకకు ఆనుకొని ఉన్న మా ప్రాంతంలో 1. వగుడు/వొగుడు 2. సగుడు అనే రెండు పదా లు ప్రజలు ఇప్పుడూ ఉపయోగిస్తున్నారు.వగుడు అంటే వదిలివేసిన అని అర్థం. సగుడు అంటే జిడ్డు అని అర్థం.

ఊదా: వ్యవసాయం చేసే రైతుల ఇల్లలో పాలిచ్చే పశువులు, కాయకష్టం చేసే ఎద్దులూ ఉంటాయి. ఎద్దులు ఎముకలు విరగ్గొట్టుకొని శ్రమ చేసేవే కాని, నేరుగా డబ్బుల్ని తెచ్చిపెట్టవు. పాడి పశువులైతే పాలిస్తాయి. అమ్మితే అప్పటికప్పుడు డబ్బులు, పాలనుండి మజ్జిగ నెయ్యి వగైరా….అందుకే పచ్చిగడ్డి కాని, అవిశాకు సొప్ప వంటి మంచి మేతను మొదట పాలిచ్చే వాటికి వేసి, అవి తినగా మిగిలిన “వగుడు”ను ఎద్దులకు వేస్తారు. ఆ ఎద్దులు కూడా తిని అంతో ఇంతో మిగిల్చిన వగుడులో మిగిలిన వగుడును…. రైతుల దగ్గర అడుక్కొనే సంచార జాతులు.. ఇతర కూలీ నాలీ జనాలు వారి పశువులకు అడిగితే ఇస్తారు.

ఈ వగడు పదాన్ని ఉపయోగించి అగ్ర రాజ్యాల వారు తయారు చేసి అక్కడ ఉపయోగపడని, వారు నిరాకరించిన వాటిని మన దేశం ఇతరా బడుగు దేశాలకు సరఫరా చేసే విధానాన్ని ఎండగడుతూ ఉపయోగానికి తేవచ్చు.

కర్నాటకకు ఆనుకొని ఉన్న మా ప్రాంతంలో చలికాలం లో అనపకాయ అనేది విపరీతంగా మారుకట్టకు వస్తుంది. ఇక్కడివారు రకరకాలుగా చారులు, పులుసులు, వేపుళ్లు చేసుకొని తింటారు. సంతల్లో రాసులు పోసి అమ్ముతుంటారు.

కొనడానికి వెళ్లి బేరం చేస్తే ఒకరు ధర ఎక్కువ చెప్పినారు అనుకొందాం. అప్పుడు అమ్మే అతను/ ఆమె “ఇది మామూలుది కాదు అలా చేత్తో తాకి చూడు” అని పిడికిట్లో పట్టుకొని చూసేలా చేయడం జరుగుతుందు. బేరం కుదరక వెళ్లి పోతాడు. అక్కడి నుంచి దూరంగా పోయినా అతని చేతికి అంటిన “సగుడు” తన వాసనను వదల్దు. చేతికి అంటిపెట్టుకొని మరలా వెనక్కు లాగుతుంది. (అనప కాయల మీద నూనె వంటి జిడ్డు వుంటుంది. మరలా సబ్బుతో కడిగితే కాని దాని పరిమళం పోదు) మరలా కొనడం జరుగుతుంది.

ఈ అగ్ర రాజ్యాలూ, టీ వీ ప్రకటనలు అన్ని కూడా ఈ సగుడు లాగా అమాయకులకు ఊరకే రుచి చూపి మరలా వాటికే బానిసలయ్యేలా చేస్తూ దోపిడీలకు ద్వారాలు తెరుస్తున్నాయి.

ఈ రెండు పదాలనూ వాడుక చేసుకొంటే మన పదసంపద మరింత విస్త్రృతమౌతుందికదా!!ఆలోచించండి.

One thought on “పదాల వెతుకులాట…

  1. మీరిచ్చిన వివరణ బావుందండీ ..
    వగడు సగడు వాడకంలో ప్రయత్నించి చూద్దాం.
    మారుకట్టకు అనే పదం రెండో సారి చదివితే కానీ అర్ధం అయింది. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)