Featured కాలమ్స్

పీడితుల తప్పుడు చైతన్య చిత్రణ

జి. లక్ష్మీ నరసయ్య

భారత సమాజంలో పీడక కుల, హిందూ ఆధిపత్య సంస్కృతి పీడిత కుల ప్రజల్నీ, మైనారిటీ మతాల ప్రజల్నీ ఒక రకమైన తప్పుడు చైతన్యానికి గురిచేసింది. ఆత్మన్యూనతలో ముంచి తమను తామే తృణీకరించుకుని, తమది కానీ సంస్కృతిని సొంతం చేసుకునే దుస్థితికి నెట్టింది. ఆధిపత్య హిందూ కులాలు తమకోసం నిర్మించుకున్న సంస్కృతిలో, పీడిత కుల, మైనారిటీలకు తక్కువతనాన్ని, చెడ్డతనాన్నీ, కిరాతకత్వాన్నీ అంటగట్టి వారిమీద వారికే రోతబుట్టే పరిస్థితిని సృష్టించడం వాళ్ళ పీడిత అఙానం వారివి కానీ విలువల్ని తొడుగులుగా సవీకరించీ ధోరణి వచ్చ్చింది. ఇది ముఖ్యంగా చదువుకున్నవారిలో, యువతీ యువకుల్లో ఉద్యోగుల్లో ముమ్మరమైంది. ఫలితంగా భాష విషయంలో, అలవాట్ల విషయంలో, పాండిత్యం విషయంలో ఏమి చేస్తే అగ్రకుల హిందువులు అంగీకరిస్తారనీ, గుర్తిస్తారని అనుకున్నారో ఆ రకమైన సాంస్కృతిక ఆచరణకు గురయ్యారు. ఈ సాంస్కృతిక పరాధీనతనీ, అది సృష్టించిన గడబిడనీ, తండ్లాటనీ బహుజన సాహిత్యం ప్రతిబింబించింది.
‘పదునెక్కిన పాట’ దళిత కవితా సంకలనం ఈ ఇతివృత్తాన్ని కొంతవరకు చిత్రించింది. కానీ మద్దూరి నగేష్ బాబు రాసిన ‘పుట్ట’ దీర్ఘకావ్యం దీన్ని పతాక స్థాయికి తీసుకెల్లింది. వినోదిని కథలూ, పసునూరి రవీందర్ ‘ఊగీ ఊగీ ఉయ్యాల’ కథ, ఎండ్లూరి మానస ‘దొంగబొట్టు’, ఇంకా స్వామి రాసిన ‘తల్లి మట్టి’ కథ ఈ థీమ్ ని విభిన్న కోణాలనుంచి చిత్రించాయి.


‘పుట్ట’ లో పుట్టాను అగ్రకుల హిందూ వ్యవస్థకు ప్రతీకగా వాడాడు నగేష్ బాబు. పీడిత కులాల ప్రజల్ని వారి మూలాలనుంచీ, వేదనల నుంచీ, ఉద్యమాల నుంచీ పక్కకు లాగుతున్న పీడక వ్యవస్థనే, ఆ వ్యవస్థలో సొంత తనం పోగొట్టుకుని ‘పరాయి’గా మిగులుతున్న దళిత బహుజన యువతీ యువకుల్ని పుట్ట చిత్రిస్తుంది.
‘ప్రియురాలా మన్నించు! / నువ్వోచ్ఛేలోగా / బార్లా తెరిచినా నాలోకి / ఒక పామొచ్చింది / నీకు కావాల్సిన అత్యంతఅద్భుత సంపదనంతా / పాము తాగేసి పడుకుని / లేచి ముఖం కడుక్కు పోయింది / నా ముఖం మీద గాట్లు మిగిలాయి.” మాయా వాస్తవికత టెక్నీక్ తో మొదలైన ఈ కావ్యం చివరి వరకూ ఇదే టెక్నీక్ తో సాగుతుంది. దీనికి ముందుమాట రాస్తూ ఖాజా ఏమన్నాడో చూడండి.

“పుట్ట అందాన్ని చూసి, పుట్ట ఒంపుసొంపులు చూసి, పుట్టలోకి పరిగెత్తి పాము వాతపడి, లూసిఫెర్ ఉచ్ఛులో చిక్కి మెఫిస్టిలోఫిస్ కి లొంగిపోయిన ఒక ప్రొటాగనిస్ట్ ఈ మహా కావ్యాన్ని మీతో మాట్లాడుతున్నాడు. ”
ఆధిపత్య హైందవ సంస్కృతి ఆకర్షణలో పది పుట్టి పెటిగిన సంస్కృతిని అసహ్యించుకునే దళితుడి ధోరణిని చూడండి.
“పాము ముందు – పాము అపార సాయందర్యం ముందు / నువ్వా దిష్టికుండలా ఉంటావు / ఒక అస్థిపంజరంలా ఉంటావు ” ఇట్లా తప్పుడు విలువలకు లొంగిపోయి వ్యక్తిత్వాన్ని కోల్పోయిన ఫలితంగా తప్పుడు చైతన్యంతో తప్ప మనుగడ సాగించలేని దుస్థితిని పలికిస్తాడు.
“పాము కల్లో తప్ప చూడలేని వాడ్ని / పాము చేతితో తప్ప రాయలేనివాడ్ని / పడగతో తప్ప ఆలోచించలేనివాడ్ని / పొట్టతో తప్ప పాకలేనివాడ్ని” అన్న చైతన్యంతో దిగజారిన దళిత బహుజన యువత నిర్వీర్యత ఇది.

చుట్టూ జరుగుతున్నా పీడిత కుల ఉద్యమాలు గాని, ఆత్మా గౌరవపోరాటాలు గానీ పట్టని ఈ దిగజారుడు స్వజనపు వినిమయ సంస్కృతిని బలంగా చాటుతూ ఇంకా అంటాడు.
“నేనిప్పుడు నెత్తురూలేని వాడిని / పచ్ఛంగా మారిపోయిన కాషాయ పసికర్ల రోగిని / నిన్ననే ఓ పాము పిల్లని కన్నా పచ్చ్చి బాలింతుడ్ని / షేర్ మార్కెట్ లావాదేవీలే తప్ప చుండూరు గురించిగానీ / డీ ఏ పెంపుదల గురించే తప్ప కారంచేడు సరిహద్దుల్లో గాని / పడక సుఖాన్ని తప్ప పదిరికుప్పాన్ని స్మరించడం కానీ / చేతకాని వాడ్ని”
ఆత్మా న్యూనతా సుఖ వ్యామోహం చుట్టుముట్టి ఊబిలోకి పూర్తిగా మునిగి పీడకుల చేసి ఆయధంగా మారుతున్న పీడితుల కన్ఫెషన్ ని కూడా పలికిస్తున్నాడు.
“శత్రువు చేతిలో ఛంసెల్లర్ సిగరెట్లం / సచివాలయం ముందు చప్పట్లు చరుస్తూ ఆడుకోకుంటున్నాం. / మెం వ్యక్తిగారా కాంక్షల లసలసల గజ్జి కురుపులం / క్షమించు ప్రియురాలా / పెంటిలేసుకోగానే / నీ ముతక తనాన్ని అసహ్యించుకున్నాను / నాలుగు ఎంగిలి ముక్కలు నేర్పగానే / నీ మోటుదనాన్ని ఎద్దేవా చేశాను.”

పైమెట్ల మీద ఉన్నవాళ్ళ కోసం ఉద్దేశించబడిన చదువూ, భాషా సొంత సంస్కృతి పాలిట గొడ్డలిపెట్టుగా మారిన తీరును పైవిధంగా పట్టుకొస్తాడు.
ఫ్యూయర్ బా మాట చైతన్యం గురించి మాట్లాడుతూ వాడిన మతసహజాతం (religious impulse) అనే కాన్సెప్టుతో ఈ తప్పుడు చైతన్యపు తాత్విక మూలాలున్నప్పటికీ ఫ్రెడరిక్ ఏంజెల్స్ దీనిని తొలిసారిగా స్పష్టపరిచాడు. “An inability to see things, especially social relations and relations of exploitation, as they really are” ఇదీ ఫాల్స్ కాన్షస్ నెస్ కు ఏంజెల్స్ ఇఛ్చిన వివరణ. కానీ ఇంచుమిచు అదే సమయంలో ఇండియాలో మహాత్మా జోతిబా పూలే కుల చైతన్యాన్ని వివరించే క్రమంలో పీడిత కులాలు బానిసత్వాన్ని సహజ జీవిరంగా, అగ్రకుల విలువల్నే తమ విలువలుగా భావించే స్థితికి గురైన సామాజిక, చారిత్రిక క్రమాన్ని వివరించారు. తన “గులాం గిరి” అనే పుస్తకంలో కుల వ్యవస్థ పీడిత కులస్తులని ఒక భ్రమాజనిత సంతృప్తి ( ఇలియూజరీ కంటెంట్ మెంట్)లో బ్రతికేటట్లు తప్పుడు చైతన్యాన్ని వారిలో ప్రవేశపెడుతుందని విశ్లేషించాడు. ఫ్యూలే ప్రకారం పీడిత కులాల తప్పుడు చైతన్యం కుల విధాన జీవనం నుంచి అబ్బిన చైతన్యం. It is the inevitable result of a way of living assigned by caste system and characterizes the chronic kind of servitude that can not perceive its own situation”

సరిగా ఫూలే వివరించిన ఈ స్థితినే నగేష్ బాబు సవిత్వీకరిస్తున్నాడు. కుల భావజాలం కారణంగా కళ్ళెదురుగా ఉన్న వాస్తవాన్ని కూడా చూడలేనితనాన్ని చిత్రిస్తున్నాడు.
“నాకు నదులూ పర్వతాలూ అరణ్యాలూ / ఏమీ కాపాడ్డం లేదు / కాలనీలు గుడిసెలు / మాంసం దండెలూ ఎండేసిన టోళ్ళూ / ఏమీ ఏమీ కనపడడంలేదు / నా మొఖాన్ని పాము చెరిపేసింది ప్రియురాలా / లాగుజరీ స్ట్రాలెత్తి నా కల్లజన తాగేసింది / హెయిర్ పార్చీజ్ డస్టర్ తో నా తలా తుడిచేసింది”
ఒక సందర్శములో బాలగోపాల్ అన్న మాట గుర్తొస్తోంది. “ఒక్కొక్కసారి మనకి అలవడింది దృక్కోణం వాళ్ళ గానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వాళ్ళ గానీ కొన్ని విషయాలు కళ్ళముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కాదు, సామాజిక క్రమాలు కూడా ఉంటాయి.” వీటినే నగేష్ బాబు ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ స్థితి తీసుకోసిచ్చిన తల్లకిందులు విలువల వాళ్ళ తన మూలాల్ని మరిచిపోయి పీడిత కులాల ప్రయోజనాలకు భిన్నంగా తయారై, రానా జనం అనుభవిస్తున్న పీడనని అగ్రకుల ప్రవర్తనా నియమాలనుంచి అర్థం చేసుకుంటున్న పీడిత కుల యువతీ యువకుల్ని గొప్పగా ధ్వనిస్తున్నాడు. “నాకొక నాగరికత లేదు / ఒక సంస్కృతి లేదు / నాకొక భాష లేదు నాకో చరిత్ర లేదు / కనీస ఏటవాలు ఎందులోనైనా నాకొక నీడ లేదు” అనే ఎరుకను రికార్డ్ చేసాడు.

అంతటితో ఆగకుండా దారి తప్పిన ఈ పీడిత యువత తమ సొంతతనాన్ని గుర్తించి ఆత్మగౌరవం వైపు వేస్తున్న అడుగుల్ని కూడా ధ్వనించాడు కవి. …. అనే ధోరణితో తన కావ్యాన్ని ముగిస్తాడు. ” కృపామూర్తీ / కారుణ్యమయీ / నల్లతల్లీ నా ప్రియురాలా / దయతో మళ్ళీ ని గర్భంలో పొదువుకో / జాలితోనైనా నన్ను తొమ్మిది ఘడియలైనా మోసి / మళ్ళీ నన్ను ఉతకాలాడు / ఈ పుట్టనుంది నాకు విముక్తి ప్రసాదించు ప్రియురాలా! / ఈసారి తప్పకుండా నీ ముఖంతోనే పుడతాను / నీ నవ్వుతోనే నీ ఏడుపుతోనే నీ కోపంతోనే / నీ ప్రేమతో నీ ప్రతీకారేఛ్చాతోనే పుడతాను తల్లీ / కనీసం ఒక దుంగనైనా పుట్టి / ఈ పుట్టని నేలమట్టం చేస్తా”
ఇలా కవి ఒక ఆత్మవిమర్శ తాలూకా మధనం నుంచి అసలైన చైతన్యానికి రీచ్ కావలసిన అవసరాన్ని కవిత్వీకరించాడు. ఇదే ఇతివృత్తాన్ని, కథల ద్వారా ఎట్లా ట్రీట్ చేశారో కూడా తరువాత చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)