వ్యాసం

బీసీ అస్తిత్వ సాహిత్యోద్యమాల తాత్విక పునాది…?

 

అస్తిత్వ పోరాటాల్లోకెల్లా అత్యంత సంక్లిష్టమైన అస్తిత్వ పోరాటం బీసీ అస్తిత్వ పోరాటం. వందలాది కులాలు ఒక పట్టికలో ఉండడం ఒక కారణం కాగా..,జనాభా పరంగానూ ‘బహు’జనులుగా ఉన్న ఈ కులాల ఐక్యత అన్నది అతి పెద్ద సవాలు. కులాలుగా బతుకుతూ తరగతులుగా చెలామణీ అవుతున్న విచిత్ర అస్తిత్వం బీసీలది. సమాజంలోనే కాదు సాహిత్యంలోనూ నూటికి ముప్పాతిక శాతం బీసీ కులాల సృష్టే. అయినప్పటికీ బీసీలు బీసీ కోసం రాసుకున్నది చాలా తక్కువే. అస్త్తిత్వ సాహిత్యోద్యమాల్లో చాలా ఆలస్యంగా మొదలైన పోరాటం బీసీ అస్తిత్వపోరాటం.

అసలు బీసీలకూ అస్తిత్వం ఎందుకు?వాళ్ళలో ఐక్యత ఎక్కడ ఏడ్చి చచ్చిందనే పుచ్చు వాదను నడుసున్న సందర్భంను దాటి బీసీలు బీసీలుగా మాట్లాడుతున్న కాలమిది. బీసీలు అస్తిత్వం కోసం మాట్లాడినప్పుడే సమాజం విచ్ఛినమైపోతోందని గగ్గోలు పెడుతున్న నకిలీ దేశభక్తులు సంచరిస్తున్న సమయం నుండి బీసీలు మాట్లాడుతున్నారు. బీసీలు అస్తిత్వం కోసం మాట్లాడినప్పుడే మీ తాత్విక పునాది ఏది? అని అడుగుతున్న ఎర్రదండు సంకుచితాలకు ధీటైన సమాధానం ఇవ్వడానికి బయలుదేరిన సమూహం సందర్భం ఇది. అవును`ఎన్ని ప్రశ్నలు…ఇంకెన్ని అవమానాలు…శతకోటి అవహేళన నడుమ తమ సొంత గొంతుకకోసం ఈ చెమట కులాలు తమంతటతాముగా ఫూలే`అంబేద్కర్‌ భావజాం వైపు కదుతున్న సందర్భం నుండి బీసీలు మాట్లాడుతున్నారు. బీసీలిప్పుడు రాజ్యాధికారం కోసం మాట్లాడుతున్నారు. ఎస్సీ,ఎస్టీు తమ సోదరులేననే బహుజన్‌ భావజాం నుండి మాట్లాడుతున్నరు. జనాభా దామాషా ప్రకారం తమ వాటా తమకు దక్కాల్సిందేనని నినదిస్తున్నారు. అందుకు అక్షర వేదికైంది ‘సమూహం`బి.సి. అస్తిత్వవాద యువ కవిత్వం’. ముప్పయ్‌ మంది యువ రక్త సంబంధీకు రాజ్యాధికార కవిత్వం ఈ ‘సమూహం’.

మరి నిజంగా బీసీ అస్తిత్వ పోరాటంలో తాత్విక దృక్పధం లేదా?లేదా…లేకా ఉండి కూడా ఉన్నదాన్ని గుర్తించకుండా ఉన్నారా? మరి బీసీ అస్తిత్వ పోరాటాకు తాత్విక దృక్పధపు పునాది ఎక్కడుందని ప్రశ్నించినవాళ్ళు బీసీక్కూడా ఒక తాత్విక దృక్పధం ఉండడాన్ని అంగీకరిస్తున్నారా? అసలు కు అస్తిత్వ ఉద్యమాకే పునాది లేదు?తాత్విక దృక్పధపు పునాది లేదు?మరి అని మన ఎర్రన్నలు పదేపదే అడిగే స్టేట్‌మెంట్‌ ఒకటుంది. అది వేరే సందర్భం. వ్యక్తిగతంగా సమూహం పుస్తక ప్రయాణంలో ఎదురైన కొన్ని స్టేట్‌మెంట్ల మీద మాట్లాడద్చుకున్నాన్నేను.

మరొక్కటికూడా ఉంది. బీసీలు అగ్రవర్ణ ఆధిపత్యం భావజాలం వైపు పయనిస్తున్నారనేది రెండవ స్టేట్‌మెంట్‌. అయితే మరి నిజంగా బీసీలకు సొంత గొంతుక లేదా?నిజంగా.., బీసీలు ఆధిపత్య భావజాలం వైపు పయనిస్తున్నారా? బీసీలు మాత్రమే ఆధిపత్య భావజాలం వైపు పయనిస్తున్నారా? అనే అంశా పైన చర్చ పెట్టడ కుండబద్ధలు కొట్టడం ఈ వ్యాస ఉద్దేశ్యం.

ఒక్క ముక్కలో చెప్పాంటే..,అస్తిత్వ ఉద్యమాల ఆదిగురువు బుద్ధుని ‘బహుజన హితాయ:బహుజన సుఖాయ:’నుండి ఫూలే వయా బాబాసాహెబ్‌ను దాటి కాన్షీరాం బహుజన్‌ సమాజ్‌ వరకు ఒక ధారగా ప్రవహించిన బహుజన్‌ భావజామే ఈ దేశంలో అత్యధికులైన బీసీ తాత్విక దృక్పధపు పునాది. ఆ విషయాన్ని గుర్తించడంలో బీసీ ఆస్యం బీసీకు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. సరే అది వేరే సంగతి. బీసీు బహుజన సాంస్కృతిక పోరాటా విప్లవ సారధి ఫూలే భావజాలపు మార్గదర్శనంలో… నిమ్న జాతుల రాజకీయ విప్లవకారుడు బాబాసాహెబ్‌ ఆలోచనా విధానాన్ని…అనుసరించే ప్రస్తుత క్రమంలో ఉన్న బీసీ అస్తిత్వ పోరాటాకు తాత్విక దృక్పధపు పునాది ఎక్కడుందనే ప్రశ్న రావడం కూడా ఒక రకంగా బీసీ అస్తిత్వ పోరాటాకు ఊతమిచ్చేదే. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే..,ఆల్‌రెడీగా ఉన్న ఫూలే,అంబేద్కర్‌ భావజాలాన్ని ఎంతమంది బీసీలు అనుసరిస్తున్నారు?అనేది సందేహాత్మకమైన ప్రశ్న. ఈ ప్రశ్న చాలా ప్రశ్నను,మరిన్ని సందేహాలను మన ముందుంచుతుంది. నిజానికి ఇప్పటికీ చాలా మంది బీసీలకు ఫూలేయిజం గానీ..,అంబేద్కరిజంగానీ తెలుసా? అనే ప్రశ్నను మనకి మనంగా వేసుకుంటే కారణాలు కోకొల్లలున్నప్పటికీ సమాధానాలు అంత అశాజనకంగా రావు.

అసలు బీసీ సమాజం తమతమ అస్తిత్వం కోసం కొట్లాడినప్పుడే ఇన్ని ప్రశ్నలెందుకు?అనంటే దళితులు బాబాసాహెబ్‌ భావజాలాన్ని ఒడిసిపట్టినంతగా బీసీలు ఫూలే భావజాలాన్ని,బాబాసాహెబ్‌ భావజాలాన్ని ఒడిసిపట్టినట్టుగా ఎక్కడా కనిపించదు.అలాగని రాజ్యం వైపు ఏమైనా ప్రయాణిస్తున్నారా?అంటే అదీ లేదు.ఇక్కడ మరొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దళితులు అస్తిత్వ ఉద్యమాలు చేసే క్రమంలో రాని సవాలక్ష ప్రశ్నలు బీసీలు పోరాడినప్పుడే ఎందుకొస్తున్నాయ్‌?అంటే దళితులు అంబేద్కరిస్టుగా చెలామణీ అవుతున్నారు…దళిత ఉద్యమం…దళిత సాహిత్యం అనగానే మనకు స్పాంటేనియస్‌గా గుర్తొచ్చేవి‘‘అంబేద్కర్‌ బమ్మ`రాజ్యాంగం`అంబేద్కర్‌ భావజాలం’’…అదే అగ్రవర్ణాలు కూడా తమ అస్తిత్వం కోసం మాట్లాడితే ‘‘రాజ్యం`యంత్రాంగం`రాజకీయం’’ మదిలో మెదులుతాయి. అదే బీసీ పోరాటాంటే గుర్తొచేవి ‘‘కుమ్మరి చక్రం`కమ్మరి కొలిమి`సాలె మగ్గం`పెరిక పగ్గం’’లాంటి శ్రమ,ఉత్పత్తి విషయాలే గుర్తొస్తాయి. అలా కాకుండా బీసీ పోరాటం అంటే అటు రాజ్యమో..,ఇటు రాజ్యాంగమో గుర్తొచ్చే పరిస్థితి వచ్చినప్పుడు..,‘‘ఒక బుద్ధుడు`ఒక ఫూలే`ఒక సాహూ`ఒక బిందేశ్వర్‌ ప్రసాద్‌ మండల్‌’’ గుర్తుకొచ్చినప్పుడు బీసీ ఉద్యమాలు, సాహిత్యోద్యమాలు ముందుకెళ్తున్నట్టు. మరో విషయం… బీసీలు, దళితులు గా పుట్టినప్పడి నుండి సర్టిఫికెట్లలో హిందువుగా చెలామణీ అవుతున్నారు.అయితే బీసీలు సర్టిఫికెట్లలో.బయటా హిందువుగా చెలామణీ అవుతున్నారు కానీ దళితు బయట చాలామట్టుకు బాబాసాహెబ్‌ వారసులుగా చెలామణీగా అవ్వడం వాళ్ళ చైతన్యానికి,అభివృద్దికి సంకేతం. అయితే బీసీ అస్తిత్యోద్యమాలు కూడా శక్తివంతంగా రూపొందాంటే మాత్రం బీసీు తక్షణమే హిందుత్వ భావను వీడి ఫూలే,అంబేద్కర్‌ భావజాలాతో పయనించాల్సి ఉంది. అలా అయితేనే బీసీ ఉద్యమాలు ముందుకెళ్తునట్టు లెఖ్ఖ.

ఇక బీసీు అగ్రవర్ణ ఆధిపత్య భావజాంలో కొట్టుకుపోతున్నారనేది మరో స్టేట్‌మంట్‌. దీన్ని పరిశీలిద్దాం.బిసీలు..,అంటే కేవం బీసీలే కాదు.ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలు అందరూ అగ్రవర్ణ ఆధిపత్య భావజాంలో కొట్టుకుపోతున్నారనేది నా అభిప్రాయం. వాస్తవానికి ప్రతీ కులం నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఎంతోకొంత తమ కిందికులాన్ని హీనంగానే చూస్తున్నది. కొంత లోతుకు పోతే డెవలప్డ్‌ బీసీలు అత్యంత వెనుకబడిన కులాలను చిన్నచూపు చూస్తుండడం గమనిస్తాం. ఇవ్వాళ దళితు చూస్తే కేవం రెండు కులాలుగా మాత్రమే చెలామణీ కావడం గమనిస్తాం. వాళ్ళు కూడా తమ ఉపకులాల పట్ల చిన్నచూపునే ప్రదర్శిస్తుండడం చూస్తున్నాం. బీసీనుండి దళితు నుండి ముస్లిం మతంలోకి మారిన పరిస్థితు కూడా ఏం భిన్నంగా లేవు. వాళ్ళు కూడా అక్కడ రెండవ శ్రేణి పౌరులుగానే చెలామణీ అవుతున్నారు. అంటే..,మనం ఏ అగ్రవర్ణానైతే ఆధిపత్య భావజాం ప్రదర్శిస్తున్నాయని అంటున్నామో  బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ అదే అగ్రవర్ణ ఆధిపత్య భావజాంలో కొట్టుకుపోతున్నారనేది అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా బీసీకు మాత్రమే వర్తించే విషయం కాదు. ఇదొక విషయమైతే..,ఎవరైతే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను వాడుకుని ఒక స్థాయికి వస్తున్నారో వారు (ఆ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు) ఒక స్థాయికి రాగానే అదే ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించడం చూస్తాం.వాస్తవానికి బాబాసాహెబ్‌ పే బ్యాక్‌ టు సొసైటీని గౌరవించని బీసీలే కాదు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ అగ్రవర్ణ ఆధిపత్య భావజాంలో కొట్టుకుపోతున్నారనేది అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. జనాభా దామాషా పద్దతిలో ఎవరి వాటా ఎంతో వారికి అంత వాటా దక్కకుండా చేస్తున్నవాళ్ళు ఎవరైనా ఆధిపత్య భావజాంలో కొట్టుకుపోతున్నారనేది అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

అసు ఇంతకీ ఆధిపత్య భావజాలం అంటే ఏమిటీ అనంటే…మనం మాత్రమే చదువుకోవాలనుకోవడం,మనం మాత్రమే మంచి బట్ట కట్టాలనుకోవడం,మనం మాత్రమే స్వేచ్ఛగా అభిప్రాయాు చెప్పానుకోవడం,మనం రాసిందే సాహిత్యం అనుకోవడం,మనం బతికే విధానమే సరైనదనుకోవడం,మనం తినే తిండే సరైనదనుకోవడం, అంతిమంగా రాజ్యం మన చేతుల్లోనే ఉండానుకోడవం…ఇదే ఆధిపత్య భావజాలం. మొత్తంగా రాజకీయం,సామాజికం,సాంస్కృతికం,ఆర్థికం,విద్యా,వైద్య,వనరులన్నీ మన గుత్తాధిపత్యంలో ఉండానుకోవడమే ఆధిపత్య భావజాలం. ఈ ఆధిపత్య భావజాలాు ఎవరిలో ఉన్నా ఖండిరచడమే ఫూలే అంబేద్కరిజం.‘స్వేచ్ఛా సమానత్వ సౌభ్రాతృత్వ న్యాయం’’అనబడే ఈ నాలుగు అంశాల కోసం పనిచేయడమే ఫూలే అంబేద్కరిజం.

అయితే ఈ సమాజాన్ని తమ రక్తం,చెమట ఇంధనంగా మార్చి ఉత్పత్తి ప్రక్రియలో కీక పాత్ర పోషిస్తున్న బీసీలు..,దేశంలో అత్యధిక ఓటు శక్తి కలిగిన బీసీలు తమ శక్తిని తాము గుర్తించక ఇంకా రాజకీయ అవకాశా కోసం,సీట్ల కోసం అల్ప సంఖ్యలో ఉన్న అగ్రవర్ణ పార్టీ చుట్టూ ప్రదక్షణలు చేయడం బీసీలు అగ్రవర్ణ ఆధిపత్య భావజాలంలో కొట్టుకుపోతున్నారనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలను కుపుకుని ముందుకెళ్తే బహుజన రాజ్యాధికారం సిద్దిస్తుందనే విషయాన్ని బీసీలు అర్థం చేసుకోవాల్సి ఉంది. నిచ్చెన మెట్ల వ్యవస్థలో మధ్యస్తంగా ఉన్న నడిమి కులాలే ఈ భాద్యతను తీసుకోవాల్సి ఉంది.నిజానికి రాజ్యాధికారదిశగా సాగాంటే కూడా వయా రాజ్యాంగం ద్వారానే సాధ్యమనే కామన్‌ పాయింట్‌ని అర్థం చేసుకోవాల్సింది బీసీలే.

సరే,వాట్‌ అబౌట్‌ బి.సి లిటరేచర్‌? బీసీ సాహిత్యకాయి చాలామంది ఫూలే,అంబేద్కర్‌ను..,వారి భావజాలాన్ని ఇప్పటికీ ఒప్పుకోవడం లేదన్నది సత్యం. బీసీ జీవితాకు బీసీ సాహిత్యానికి ఎంత అవినాభావ సంబంధం ఎందో..,బీసీ సాహిత్యంకు ఫూలే,బాబాసాహెబ్‌ భావజాలానికి అంతే అవినాభావ సంబంధం ఉన్న విషయాన్ని నేటికీ బీసీ సాహిత్యకాయి పూర్తిస్థాయిలో గుర్తించలేదన్నది వాస్తవం. అసు 1990వరకు ఫూలే చాలామంది బీసీ ఉద్యమకాయి,సాహితీకారులకే తెలియదు. ఇవన్నీ కాదు మొట్టమొదటగా కొల్లాపూర్‌ రాజ్యంలో జనాభా దామాషా పద్ధతిన తన రాజ్యంలో రిజర్వేషన్‌లు అమలు చేసిన బహుజన రిజర్వేషన్ల పితామహుడు సాహూ మహారాజ్‌ గురించి గానీ,శూద్రకుంలో పుట్టిన శివాజీ తన సైన్యంలో అన్ని సామాజిక వర్గాకు సమాన ప్రాధాన్యం ఇచ్చిన విషయం ఎక్కడైనా చర్చకు పెట్టారా ఈ బీసీ సాహిత్యకాయి?ఇవన్నీ కాదు`బీసీకు కేంద్ర ప్రభుత్వరంగసంస్థల్లో విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ు కల్పించడానికి వేసిన మండల్‌ కమీషన్‌ చేసిన ప్రతిపాదను ఏమిటో కూడా బీసీ సాహిత్యకారులకు తెలియదు. బి.సి రిజర్వేషన్‌ కల్పించడానికి కాన్షీరాం చేసిన పోరాటం..,బి.సి రిజర్వేషన్‌కోసం ముందుకొచ్చి కూలిపోయిన..,కూల్చబడిన ప్రభుత్వా గురించి..,మండల్‌ కమీషన్‌కు వ్యతిరేకంగా ఎరుపు,కాషాయం,హస్తం పార్టీ అగ్ర నాయకత్వ కుట్రలు…ఇవేమి ఈ బీసీ సాహిత్యకారుకు తెలియదు.

బీసీయేతర సాహిత్యకారులు నేటికీ బీసీ జీవితాలను తమ రచనల్లో ప్రధాన పాత్ర చేయకపోవడం చూస్తూనే ఉన్నాం…అది వాళ్ళకి వదిలేద్దాం`కాని బీసీ సాహిత్యకారులు తమ జీవితా కోసం తామైనా ఆలోచించాలి కదా…ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే వెంటాడేకలాలు,సమూహం కవిత్వం. మరిప్పడిదాకా ఈ బీసీ సాహిత్యకారులుయి, బీసీయేతర సాహిత్యకారులు ఎవరి కోసం రాసినట్టు?ఏం రాసినట్టు?అని ఆలోచిస్తే..,ఒక పల్లె`ఆ పల్లె`ఆ పల్లె పచ్చదనం వర్ణిస్తూ వాడి చెమటను బిసియేతర కవో,రచయితో తమ రచనల్లో సబ్బండ వర్ణా శ్రమ సౌందర్యంను అద్భుతంగా చెబుతాడు. మరి బీసీ కవో రచయితోనన్నా బీసీ తాత్విక పునాది`భావజాలం గురించైనా తమ సాహిత్యంలో ఏమైనా చెబుతాడా?అంటే అదీ చెప్పడు. వీళ్ళెప్పుడు ఉద్యమాలు, విప్లవాలు,మధ్యతరగతి పేదరికం,పెరిగిన కూరగాయ ధరలు,వాళ్ళ రోజువారీ బాధ గురించే అక్షరాల్లుతాడు.కానీ బీసీలంటే ఈ దేశంలో,ఈ రాష్ట్రంలో అత్యధికునీ,వాళ్ళకొక అద్భుతమైన ఓటు శక్తి ఉందని అది చట్టసభల్లో తమ గొంతుకను వినిసిస్తుందనీ…రాజ్యాధికార దిశగా సాగాని చెప్పడు. కనుక సగటు బీసీ పాఠకుడుగానీ,సాధారణ పాఠకుడు గానీ బీసీలంటే అదేముంది…‘బాధ వర్ణన`వైఫల్యాలు మోసపోవడాలు`వలస పోవడానికి’ తప్ప ఏముంటుంది అనే మొనాటమీ మూడ్‌లోకి వెళ్ళిపోతాడు. ఇలా ఈ బీసీ సాహిత్యకారులు ఓ పాతికేళ్ళు ఉద్యమ`విప్లవ సాహిత్యం..మరో పాతికేళ్ళు దళితులమనుకుని దళిత సాహిత్యం రాసి,మరో పాతికేళ్ళు ప్రపంచీకరణ మీద రాసి…ఇలా దాని మీదా దీని మీదా రాసి రాసి రాయవసిన బీసీ జీవితాలను రాయాల్సినంతగా రాయకుండానే వదిలేసారు. కాలువ మల్లయ్య ,జూలూరి గౌరీశంకర్‌,ఆచార్య.ఎస్వీ సత్యనారాయణ,బాణా శ్రీనివాస్‌,సంగిశెట్టి శ్రీనివాస్‌,సీతారాం,ప్రసేన్‌,పెద్దింటి అశోక్‌ కుమార్‌,అనిశెట్టి రజిత,మందరపు హైమావతి,జ్వలితలాంటి సీనియర్లు కొందరు డా.చింతం ప్రవీణ్‌ కుమార్‌,వనపట్ల సుబ్బయ్య,అన్నవరం దేవేందర్‌,చిర్రా రాజేష్‌ ఖన్నా,ఇట్యా కిషన్‌లాంటి ఈ తరం కవి రచయితలు ఒక స్పష్టమైన భావజాంతో ముందుకొచ్చారు. బీసీయేతర కవిరచయితల్లో డా.కొలకూరి ఇనాక్‌,డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కైబాబాలాగా కొందరు మాత్రమే అక్కడక్కడా బీసీ జీవితాలను చిత్రించారు. అయితే ఇలా బీసీ కవిరచయితు చిత్రించిన సాహిత్యంలో కూడా ఎక్కడా రాజ్యాధికార కాంక్ష కనపడదు. ఇలా మొట్టమొదటిసారిగా బీసీ రాజకీయ కాంక్షను వ్యక్తం చేస్తూ..,ఫూలే అంబేద్కర్‌ ఐడియాజీతో అదే విధంగా రాజ్యాధికార దిశగా ఎస్సీను,ఎస్టీను కుపుకుంటూ బీసీు సాగాని పిుపునిస్తూ మెవడిరదే ‘బి.సి అస్తిత్వవాద యువ కవిత్వం`సమూహం’.

బి.సి.రైటర్స్‌ వింగ్‌ ఆధ్వర్యంలో డా.చింతం ప్రవీణ్‌ కుమార్‌ సంపాదకత్వంలో మెవడిన ఈ బిసి అస్తిత్వవాద యువ కవిత్వరాసమూహం 2001లో వెలుడిన వెంటాడే కలాలు తర్వాత ఏర్పడిన రెండు దశాబ్ధాల గ్యాప్‌ను పూరించడమే కాకుండా సుమారు 10వే కిలోమీటర్లు ప్రయాణించి బహుజన్‌ ఐడియాలజీని విస్తృతంగా ప్రచారం చేసింది. వెంటాడే కలాు కూడా దళితాత్మ కవితగా ఆత్మ కవితగా ఆత్మరక్షణ కవితగా వెలుడిన విషయం తెలిసిందే. అలా కాకుండా బీసీ అస్త్తిత్వం పేరుతో కాకతీయ విశ్వవిద్యాయం ఫూలే స్టాచూ నుండి ప్రారంభమైన ఈ సమూహ ప్రయాణం అమెరికాలోని స్టాచూ ఆఫ్‌ లిబర్టీ వరకూ సాగింది. విస్తృత బీసీ సమావేశాలు, చర్చలు జరిగాయి. పాతికకు పైగా రివ్యూలు కూడా వచ్చాయి. విపరీతమైన రాజకీయ చర్చ జరిగిందీ సమూహం కవిత్వం పైన. అయితే ఈ పదివేల కిలోమీటర్ల సమూహ యాత్రలో ప్రముఖుల చాలా స్టేట్‌మెంట్లు వచ్చాయి. అందులో ప్రముఖమైన స్టేట్‌మెంట్లు వ్యాస ప్రారంభంలో పేర్కొన్నట్లుగా రెండుా1.బీసీ అస్తిత్వ సాహిత్యోద్యమాకున్న తాత్విక పునాది. 2.బీసీలు ఆధిపత్య భావజాం వెంట పరిగెత్తడం.

పైన పేర్కొన్న రెండు ప్రశ్నకు మరొక్కసారి రెండు క్లియర్‌ స్టేట్‌మెంట్లు ఇస్తూ ఈ వ్యాసం ముగిస్తాను

1.ఫూలే అంబేద్కర్‌ భావజాలమే బీసీ అస్తిత్వ సాహిత్యోద్యమాలకున్న తాత్విక పునాది

2.ఫూలే అంబేద్కర్‌ భావజాలం కలిగిన ఏ రచయితా ఆధిపత్య భావజాలాల వెంట వెర్రిగా పరిగెత్తడు.

బహుజనోద్యమాభివందనాతో…

డా.చింతం ప్రవీణ్‌ కుమార్‌

కాకతీయ విశ్వవిద్యాలయం.

9346 886 143.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)