Featured కాలమ్స్

మనం మరిచిన మహా ‘కవిరాజమూర్తి’

                                                                                                                   – సంగిశెట్టి  శ్రీనివాస్


తెలుగు సాహిత్య చరిత్రలో ఖమ్మం జిల్లాకు ఒక విశిష్ట స్థానమున్నది. తెలుగునాట హైదరాబాద్‌లో ముస్లింలు ఎక్కువగా ఉర్దూ సాహిత్యాన్ని సృజించారు. కానీ ఖమ్మం జిల్లా వాళ్ళు మొత్తం తెలంగాణలోనే ఎక్కువగా ఉర్దూ సాహిత్యాన్ని సృజించారు. అంతేగాదు ఉర్దూ నుంచి తెలుగులోకి తర్జుమా చేసిన వారు కూడా ఇక్కడి నుంచి ఎక్కువగా ఉన్నారు. ఇదంతా 1960లకు ముందటి చరిత్ర.

ఖమ్మంకు చెందిన హీరాలాల్‌ మోరియా మాతృభాష హిందీ అయినప్పటికీ ఉర్దూలో ఎక్కువగా రాసినాడు. ఉర్దూలో రామాయణ, భారతాల్ని రాసినాడు. మోరియా ఉర్దూలో చేసిన రచనలను ఊటుకూరి రంగారావు, కౌముది తదితరులు తెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే అచ్చంగా తెంగాణవాడయిన కవిరాజమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి) ఉర్దూలో రాసిన నవలల్ని కూడా ఊటుకూరి రంగారావు, గిడుతూరి సూర్యం తదితరులు తెలుగులోకి తర్జుమా చేసినారు. అవన్నీ కూడా ఆనాడు యావత్ప్రపంచంలో (ఉర్దూ రచన ద్వారా) ప్రసిద్ధి పొందాయి.

Cover pages

నిజానికి కవిత్వంలో కూడా పేదల జీవితాన్ని, అన్నార్తుల ఆక్రందనలను అక్షరాలను కరవాలంగా మలిచి చెప్పిండు. విషయం చెప్పేప్పుడు ఎక్కడా నీళ్ళు నమలకుండా, భయపడకుండా తన హృదయంలో రగిలే అగ్నిని పాఠకునికి ట్రాన్స్‌ఫర్‌ చేయడంలో కృతకృత్యుడయిండు. మహైకలో అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అన్నా, తల్లీ, చెల్లీ అంటూ సమాజంలో వంచితులైన, పీడితులైన కార్మికుడి గురించి వేశ్య గురించి బాధా తప్త హృదయంతో, మనిషి మారాలంటూ రాసినాడు.

‘‘తోటమాలి బలిదానం చేస్తేనేపువ్వు పరిమళాలు నీవగలవుమానవుడు కలవాలి మానవుణ్ణితిడితే ఏం లాభం కనుపించని దేవుణ్ణిఆకాశానికి శోభ చందమామ మిణుగురుతో విద్యుత్‌ కాంతులు ప్రసరించవుమారాలి నేటి నాటు వ్యక్తి కాకుంటే లేదెన్నటికి విముక్తి మానవునికి మానవుడే ధ్యేయం మానవత్వమే మానవజాతికి శ్రేయం చరిత్రలు మన ఉనికి కావు ప్రమాణం ధరిత్రిని వెనక్కి నెట్టి వేయాలి ప్రయాణం…’’ అంటూ సోషలిస్టు దృక్కోణంతో కవిత్వమల్లిండు.

‘‘పోరాటం, పెనుగులాటలేని బ్రతుకు చావుబాటలేమి బ్రతుకు గ్రుద్దులాట సమాజపు సంకుచితత్వంమీ`మా` చావుతో తీరదు నిజం’’ అని పోరుబాట గురించి రాసిండు. ఇదంతా సోషలిస్టు భావజాలంతో రాసిన కవిత్వమే! అయితే ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ బ్లెల్లంకొండ, రెంటాల గోపాలకృష్ణ ఇద్దరూ ఆయన్ని మార్క్సిస్టుగా ముద్ర వేసినారు. ‘‘మహోజ్వలమైన ఈ మహైక కావ్యం చదివినప్పుడు ఏదో నూతన లోకాన్ని చూచినట్టుంది. గొప్ప కావ్యధోరణి ` ఎపిక్‌ క్వాలిటీ కనుపించింది. ఇందులో పాత్రలు, కవి, సామాన్య మానవుడు, కార్మికులు, పతితలు. వీరి పరస్పర సంభాషణలు ఈ కావ్యం. నిజంగా ఇదెంత గొప్ప దర్శనం. మార్క్సిస్ట్‌ దర్శనాన్ని ఇలా వ్రాయడం ఎంతో నూతనంగా ఉంది’’ అని కవి రాజమూర్తికి మార్క్సిస్టు ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ముద్ర అని ఎందుకు అంటున్నానంటే కవిరాజమూర్తి తాను రాసిన ‘మై గరీబ్‌ హు’ నవలను 1950లోనే నెహ్రూకు అంకితమిచ్చిండు. నెహ్రూ అన్నా, సోషలిజమన్నా ఆయనకు అంత ఇష్టం. అయితే ఇందుకు విరుద్ధంగా ముందుమాట రాసిన వారు కవిరాజమూర్తిని మార్క్సిస్టుగా మార్చి వేసినారు.

Cover pages

కవిరాజమూర్తి అన్ని రచనల్లోనూ మార్క్సిజం కన్నా సోషలిజం ప్రభావమే ఎక్కువగా ఉండింది.  అందుకే సర్దార్‌ జమలాపురం కేశవరావుకి అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు. తన ‘మహైక’ కవితా సంపుటిని సర్దార్‌ జమలాపురానికి అంకిత మిచ్చాడు. ఈ సందర్భంగా ఇలా పేర్కొన్నాడు.

‘‘..రాచరికం పెకలించిన నీ కండనీ కండ దండ అండను వెతుకాడుతొంది నీవు మరుపురావు ‘జమలాపురం’తలుస్తుంది తెలుగునాడు తరం తరతరాలు తలుస్తుంది. నిరంతరం జపిస్తుంది నీ నామం` ‘జమలాపురం’’’ అంటూ ఆయనను స్మరించుకున్నాడు. కవిరాజమూర్తి రచనల్లాగే ఆయన వ్యక్తిత్వం కూడా తీవ్రమైనదే! 20 ఏండ్ల వయసులోనే ఉన్న ఊర్లోనే దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పన్నాగం పన్నినందుకు గొడవలు జరిగాయి. ఊళ్ళో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తన మకాంని హైదరాబాద్‌కు మార్చిండు. హైదరాబాద్‌లో కోటీలో ఒక చిన్న రూమ్‌లో ఉంటూ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించారు. తాను అనుభవిస్తున్న పేదరికాన్నే అక్షరాల్లో ప్రతిఫలింపజేసి ‘మై గరీబ్‌ హు’ నవలను రాసినాడు. హైదరాబాద్‌లో దాదాపు అజ్ఞాత జీవితమే గడిపిండు.

బహుశా తన గురించే ఇలా రాసుకున్నాడు కాబోలు ఈ కావ్యంలో..‘‘ఆరున్నర వత్సరాలుఈ అవని రంధ్రంలో నీటిలోని చేపవోలె చీకటిలో దాగున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)