సంపాదకీయం

రండి కలిసి నడుద్దాం..!

అడుగు చలనశీలమైనది. దారుల వెంట ముందుకు సాగేది. అడుగులు వేయడం ఒక నాగరికత. అడుగులో అడుగులు వేయడం అనుసరణగా కుచించుకుపోయినప్పుడు అడుగులు మాటల మడుగుల్లో బంధించబడినప్పుడు కొత్త పలుకు కోసం అడగడం కొత్త దిశలో ఇంకో అడుగు.
అడుగులు ఎన్నో దారుల్ని నిర్మించి ఉంటాయి. నిర్మిస్తూనూ ఉంటాయి. పునాదులుగా నిలిచి ఉంటాయి. అడుగులు మనిషిని నిర్మించి ఉంటాయి. కొత్త శిఖరాలను అధిరోహింప జేసుంటాయి. ఒక శిఖరంపై అడుగిడిన మనిషి ఇంకా ఎన్నో శిఖరారోహణలకు మొదటి అడుగుల్ని పునాదులుగా మార్చుకొనే ఉంటాడు. అడుగు ఏక కాలంలో పునాదిగానూ నిర్మాణంగానూ ఉండడమే దాని గతిశీలత.

మనం గతం అనుకునేదంతా అడుగులే. నడిచొచ్చిన దారులే. ఆ దారులెన్నో అణగారిన అడుగుల్ని అడుక్కు తొక్కినవే.. విజయమో పరాభవమో ఆశో నిరాశో ప్రేమో వియోగమో గమ్యమో గమనమో అన్ని ద్వంద్వాలూ అడుగులే, అనుభవాలే. మానవ జీవన సారమంతా మహాస్రష్ఠలు దీపధారులై నిర్మించిన సాహిత్యం ఎన్ని అడుగులదో.. ఎంతమంది జాడలదో! పచ్చిక మొలచి పూలు పూసి మీ దారి కిరువైపులా సుసంపన్నమైన జీవితేచ్ఛ విరగకాస్తుందంటే అది ఎంతమంది అడుగుల ఫలసాయమో! ఏరువాక నాటి నుండి ఒక పొలంలో వేసే అడుగులు పైరును అన్నంగా మార్చినట్లు సాహిత్య సాగుదారుల అడుగుల్ని ఇక్కడ ఫలవంతం చేసుకొమ్మని అడుగుతున్నాం.

అడుగు ఏకవచనంగా అనిపిస్తుంది గానీ అది బహువచనంగా ప్రతిఫలించే వైనాన్ని గుర్తించమంటున్నాం. తడబడే అడుగుల బాల్యం స్థిరమైన లక్ష్య యవ్వనంగా మారుతుంది. అడుగులే నిలవని తాడు దారుల మీద సాహస వచనంగా స్థిరపడుతుంది. అడుగులే పడని ఊబి దారుల్లో ఉద్యమ ప్రస్థానాలై వెలుగుతుంది. రండి కలిసి నడుద్దాం..!
*
(అడుగు అక్షరాలు, కవితలకు బొమ్మలు వేస్తున్న అక్బర్ కు స్పెషల్ షుక్రియా. మన్నెం శారద, వెబ్ డిజైనర్ హేమసుందర్ & టీమ్, రమణ జీవి లకు చాలా చాలా థాంక్స్!)

30 thoughts on “రండి కలిసి నడుద్దాం..!

 1. మీ అడుగులు గొప్ప పరిణామాల దిశగా సాగాలనీ.ఆకాంక్షిస్తూ

 2. high quality literary contents are collected for this issue. great effort and great contribution to field. congrats to team..

 3. ఇంత తక్కువ సమయంలో ఆలోచనని ఆచరణలో పెట్టగలిగారంటే ఆశ్చర్యంగా ఆద్భుతంగా ఉంది. మొదటి సంచిక బావుంది. లే అవుట్ చూడచక్కగా ఉంది. కృషి చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అడుగు టీం.

 4. అడుగు మాస పత్రికకు హర్ధిక అభినందనలు మరియు హర్ధిక శుభాకాంక్షలు.

 5. All the best adugu team.
  మీ ప్రయాణం విజయవంతమవ్వాలని కోరుతూ..సాయి .గోరంట్ల

 6. తొలి అడుగు కి ఆహ్వానం .
  ఈ అడుగు సామాజికం .
  అందుకు బాధ్యులు అయిన మిత్రులకు
  అభినందనలు

 7. “అడుగు ” అంతర్జాల మాసపత్రికకు అభినందన మందార మాల …

 8. అడుగు… బలమైన అడుగులు వేస్తూ
  తనదైన ముద్రని వేయాలని ఆశిస్తూ…
  శుభాభినందనలతో…

 9. అభినందనలు..రచనలు పంపాల్సిన చిరునామా కూడా తెలుప ప్రార్ధన.

   1. అడుగు.ఇన్ కు పంపాను..కానీ వెనక్కొచ్చింది..అందుకే ఇప్పుడీ చిరునామా కు పంపుతున్నా వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు..

 10. మెుదటి అడుగు అందంగా ఆనందంగా ఆకర్షణీయంగా ఆహ్లాదంగా ఆలోచనీయంగా ఉంది. శుభాభినందనలు!
  సంపాదకవర్గానికి శుభాకాంక్షలు!!
  మీ తో పాటు అడుగులు వేయగలమెా లేమెా కాని తోడ్పాటు ఉంటుందన్నహామీ మాత్రం ఉంది!!!

 11. అడుగు చూసి ముచ్చట పడ్డాను ., ఈ చిన్న అడుగు – మరి కొన్ని అడుగులు చేర్చుకొని / కలుపుకుని – మరింత బలమైన అడుగు వేయాలని కోరుకుంటూ – –

 12. స్కై బాబాకి మనఃపూర్వక అభినందనలు.
  విజయవంతం గా నీ ప్రయత్నం సాగాలి.
  సుబ్బాచారి పులికొండ

 13. తొలి అడుగుకు హృదయపూర్వక స్వాగతం

 14. అడుగు చాలా బావుంది.శుభాభినందనలు.

 15. మీ పత్రిక లో
  సంపాదకీయం
  సాయి బాబా గారి లేఖ ప్రచురించడం
  చాలా బాగుంది

 16. కలవడం,కలపడం,కలిసి నడవడం ఈ దశాబ్దికి మరీ మరీ అవసరం.
  సంపాదక వర్గానికి నమస్కారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)