షాయరీ

రెండు ఊచకోతలు-రెండు కవితలు

రెండు ఊచకోతలు-రెండు కవితలు


I
బర్మా హింస
అది చూసి
బావురుమనాలి
బౌద్ధ హంస
ఏ కాలంలోనూ
ఏ దేవుడూ
ఎవరినీ రక్షించలేదు
ఏ హంతకుల్నీ
ఏ రాజ్యం
ఎన్నడూ శిక్షించలేదు
మతస్తుల్ని చంపేరా
మనుషుల్ని చంపేరా
ఇప్పుడు కుల నిర్మూలనే కాదు
మత నిర్మూలనా జరగాలి
మనుషుల్లారా!
దేవుళ్ళని నమ్మి మోసపోకండి
ఘర్షణలు జరిగినప్పుడల్లా
దేవుళ్ళు మరణిస్తూ ఉంటారు
నిస్సహాయంగా చూస్తూ ఉంటారు
రక్త రోహింగ్యా!
నీ హంతకుల్ని
కాలం విడిచిపెట్టదు.


II
గౌరీ!
మీ నాన్నతో కలిసి
సాహిత్య అకాడెమీ
సెంట్రల్ కాలేజీ హాల్లో
కర్ణాటక కవి సమ్మేళనాల్లో
కవితలు చదివాను.
మీ నాన్న రక్తం
నీలోనూ ప్రవహించకుండా
ఎలా ఉంటుంది?
మీ నాన్న భావజాల వారసత్వం
నీలోనూ నినదిస్తూ ఉంటుంది
అది నిలదీస్తూ ఉంటుంది
ఆడపిల్లను చంపి
భారతమాతను హత్య చేసారు
ముష్కరులో దుష్ట దుష్కరులో
నారింజ రంగు నాటు తుపాకి వేటగాళ్ళు
నిజంగా నిన్ను కాదమ్మా
నా బిడ్డనే చంపినట్లుగా ఉంది.

ఎండ్లూరి సుధాకర్
9246650771

9 thoughts on “రెండు ఊచకోతలు-రెండు కవితలు

  1. సుధాకర్ సర్, కవితలు బాగున్నాయని చెప్పలేనంత నొప్పిగా వుంది నాకు. బోల్డంత దుక్కం వొస్తంది. మనం జీవించే ఈ భూమింత నెత్తురు వొలుకుంతుంది. ఇంకెంత బీభత్సం చూడాలో కదా.

  2. చాలా బావుంది సుధాకర్ గారూ . నిజమే “ఆడపిల్లను చంపి
    భారతమాతను హత్య చేసారు”

  3. నిజం సుధాకర్ సార్. కులమే కాదు మతాన్నీ నిర్మూలన చేయాలి.

  4. నిజమే సర్ రోహింగ్య హంతకులను కాలం విడిచిపెట్టదు ..
    ఆడపిల్లను చంపి భరతమాతను చంపారంటూ హృదయాన్ని మెలిపెట్టే కవిత రాసారు

  5. ఈ పత్రిక తరువాత అడుగు ఆగిపోయిందా, ముందుకు సాగడం లేదా?

    1. లేదండి మల్లిక్ గారూ. అడుగు మాస పత్రిక. కాబట్టి నెలకోసారే కథలు, కవితల అప్డేట్ జరుగుతుంది.
      ఇవాళ చేశాము చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)