వ్యాసం

నిబద్దతే గీటురాయి

ఈ కార్టూన్ లకు ఒక నేపథ్యం ఉంది. ఈ కార్టూన్ లు పొలిటికల్ సటైర్లు నిజానికి. ఇవి విప్లవ ఆచరణను ప్రశ్నిస్తాయి. విప్లవోద్యమ నిబద్దతను తర్కిస్తాయి.
మొదలుగా సాయిబాబా ఎంతో ఆవేదనతో రాసిన ఉత్తరం మీడియాలో ఒక తీవ్రమైన చలనం రేపింది. అంతవరకు స్తబ్దుగా ఉన్న దేశం మళ్ళీ ఒక సారి సాయిబాబా పరిస్థితిని నార్మలైజ్ చేయకుండా ఒక ధర్మబద్దమైన డిమాండుగా, ఒక అబ్నార్మల్ కేసు కింద పరిగణిస్తూ చర్చించాల్సి వచ్చింది.
అయితే ఆ ఉత్తరం తో సభలు సమావేశాలు మళ్ళీ కలకలం మొదలు కావడం జరిగింది. సాధారణ ప్రజానీకం కూదా సింపతీ చూపించడం తెలిసిపోతుంది. ఎన్నో ప్రజా సంఘాలు, పార్టీలు రాజకీయాలు పక్కన బెట్టి సపోర్ట్ చేస్తూ సాయిబాబాకు మద్దతుగా నిలబడ్డానికి సంసిద్ధమయ్యాయి. ఈ క్రమంలో – ఎక్కడొ ఒక చోట రావాల్సిన ప్రశ్ననే వచ్చింది. ఇంత బ్లటంట్ అండ్ క్రూయల్ గా రాజ్యం ప్రవర్తిస్తుంటే, అందుకు తీసుకున్న తగిన చర్యలు ఏమిటి అని ? ఇదే ప్రశ్నను బహుజన రచయితల సంఘం కు సంబంధించిన జిలుకర శ్రీనివాస్ తన వాల్ మీద లేవనెత్తారు.
” నాకు సాయిబాబ రాజకీయ విశ్వాసాలతో సంబంధం లేదు. ఆయన భావజాలంతో ఏకీభావం లేదు.‌ అయినా సరే, అతని రాజ్యాంగ హక్కులను గౌరవించి, బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఆయన ప్రాణాలు కాపాడాలి ” అంటూ తన మద్దతు తెలుపుతూ అక్టోబర్ 30 న ఫేస్ బుక్ పోస్టులో పెట్టారు. ఆ తర్వాత నవంబర్ రెండో తేదీన తన మద్దతుతో పాటు ఒక అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇలా రాసారు, “సాయిబాబా బెయిల్ కోసం పని చేస్తున్న వాళ్ళు ఎవరు? సెషన్ కోర్టు ఆయనకు శిక్ష వేస్తే, జిల్లా కోర్టులో అప్పీలు చేయొచ్చు. అక్కడ తిరస్కరిస్తే, హైకోర్టుకు వెళ్ళొచ్చు. అక్కడా తిరస్కరిస్తే, సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్. అలాంటి పని జరిగిందా? ఇప్పుడు బెయిల్ పిటిషన్ స్టేటస్ ఏంటి? ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియాలి. ఆయన్ను జైల్లో పెట్టి ఇన్ని నెలలవుతున్నా, పై కోర్టులో అప్పీలు చేయకపోవటమేంటి? ఎప్పుడూ శత్రవుని విమర్శిస్తూ, ప్రజల భావోద్వేగాలను గాయపర్చటం కాదు. లీగల్ ప్రొసీజర్ లో చేసిన ప్రయత్నం ఎక్కడిదాకా వచ్చిందో చెప్పాలి. అలాంటి సమాచారం ఇస్తే, సాయిబాబాకు సంఘీభావం ప్రకటించే వాళ్ళ కార్యాచరణలో స్పష్టత వస్తుంది.. …”

(https://www.facebook.com/profile.php?id=543502355hc_ref=ARRX0YkNegNmPILtNrSc5BY1wOw6iaC47KMX9qVTJ9LHkjqF6IqbIYU-IIbagjXUOuofref=nf)

దీనికి సమాధానంగా పి. విక్టర్ విజయ్ కుమార్ ( అంటే నేను ) విషయం వివరిస్తా ఇలా ముగించాడు, “నిజాయితీగా మాట్లాడితే – సాయిబాబ అమరత్వం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇది అఫెన్ సివ్ స్టేట్మెంట్ గాని, ఇందులో వాస్తవం ఉంది. అన్ ఫార్చునేట్ గా ఇది ప్రభుత్వ పరిపాలనలా ఉండదు కాని, ఎంక్వైరీలా పెడితే చాల అలసత్వం బయట పడుతుంది. సాయిబాబ పోరాట స్థాయికి తగ్గ సోషల్ కేపిటల్ లేదు. తాను ఆధారపడీన ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్ ఎంత ఉండొ చూడకుండా సముద్రం లో దూకేసిన వ్యక్తి. నేను పెర్సొనల్ గా బాగా ఫీల్ అయ్యేదేమంటే – రెడ్ హేండెడ్ గా మావోయిస్టులతో కలిసి పట్టుబడిన విప్లవ మేధావులు కూడా వాళ్ళకుండే సోషల్ కేపిటల్ ద్వారా హీరోలుగా మిగిలి జైలు ఫొటోలు పెట్టుకుని, వ్యాసాలు రాసుకుని, రాజ్యం కుట్రల మీద కవితలు రాసుకుని శిక్ష పడకుండా బయట పడగలుగుతున్నారు గాని – ఏ నేరమూ ప్రూవ్ అవ్వకుండానే విచిత్రంగా సాయిబాబా ఇంకా ఆ హింసల పంజరం లో మిగిలిపోయాడు. సాయిబాబా బయటకు రాకుండా కుట్రలు జరుగుతు

న్నాయని అనడం లేదు గాని….తొందరగా బయట పడేలా ఆత్రం లేదు. చూద్దాం…సాయిబాబా మరణాన్ని ఎంత లాజికల్ గా తీసుకొస్తారో. సాయిబాబాకు ఏవన్నా అయితే – రాజ్యాన్ని ఏకడం దేవుడెరుగు. బట్, నాలాంటి సామాన్య ప్రజలు మాత్రం ఇక ఈ విప్లవోద్యమ దివాళాకోరుతనాన్ని మాత్రం ఎప్పుడు క్షమించరు. ” ఇందులో చాలా తీవ్ర అసంతృప్తిని , ఆవేదనను, యాంక్సైటీని తెలుపుతూ ఘాటుగా రాయడం జరిగింది.

ఈ కామెంట్ ను కూడా తాను ఒక చోట క్వాలిఫై చేస్తూ ఇలా రాసాడు “Finding flaws with someone engaged in the scene is not the mainstream fight. Some particular point of time, questions rise and someone should have some answer for it. ” ఇది మెయిన్ స్ట్రీం ఫైట్ గా ఉండకుండా సాయిబాబ రిలీజ్ కోసం ఖచ్చితంగా పోరాడాలి అని రాసాను.

ఎక్కడొ ఫేస్ బుక్కు మూలలో జరిగిన ఈ కామెంట్ మెయిన్ స్ట్రీంలోకి విరసం లాగి దీనికి బదులివ్వాలని నిర్ణయించుకుంది. బదులివ్వడంలో తప్పు లేదు. తప్పంతా – ఇది మెయిన్ స్ట్రీం తో సమాంతరమైన ప్రాధాన్యతను సంతరించుకునేలా ప్రవర్తించడం. రెండు – ప్రజలందరికీ సాధారణ రిప్లైలా కాక, అసలు విమర్శ పై ఫోకస్ కాక విమర్శించిన వ్యక్తిని ప్రత్యక్షంగా దాడి చేస్తూ ప్రకటన విడుదల చేసిన పద్దతి తప్పు.

కేవలం ఒకే ప్లాట్ఫాం మీద ఉన్న వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గేప్ ఎందుకనే కర్టసీ తో ఈ విషయమై నేను విరసం వరలక్ష్మి మరియు వరవర రావుకు నచ్చజెప్పడానికి ఫోన్ చేయడం కూడా అయింది. ఆ ప్రయత్నం లో – ఇక్కడ ఒక ‘ బ్రాహ్మణీక అహంకారం ‘ దెబ్బ తిన్నది అనే యావ తప్ప, నిజానికి సాయిబాబ గురించి సిన్సియర్ గా ఎవరు అడిగినా అడక్క పోయినా సమాధానం ఇద్దాం అనే నిబద్దత లేకపోవడం తెలిసింది. ఇది ఒక ఐసోలేటెడ్ సంఘటనగా చూడ్డానికి కూడా తావు లేదు. ఇంత సీరియస్ ఫైట్ జరుగుతున్నప్పుడు అంత మంది సాధారణ ప్రజానీకం కలిసి మద్దతు ఇస్తున్నప్పుడూ నైతిక బాధ్యతతో ప్రవర్తించక, ఏదో గదమాయించి, వ్యక్తిగత ఆరోపణలు చేసి నోరు మూపిద్దమనే ప్రయత్నం అందునా సీనియర్ విప్లవ కవులు అని చెప్పుకున్న వాళ్ళు చేయడం ఖచ్చితంగా వీళ్ళ ఆచరణను ఎక్స్ పోజ్ చేయకపోతే , చాప కింద దుర్ఘటనలెన్ని జరుగుతాయో తెలీదు.

నిజానికి విరసం పేరుతో ఈ ప్రకటన రిలీజ్ అయినా , నా గురించి బాగ తెలిసినట్టు రాసిన వాళ్ళు వరవరరావు గారు మాత్రమే ఇది రాసారు అని చెప్పడానికి క్లియర్ ఆధారాలున్నయి. ఇందులో ” అతడికి (ఆతడు అనే ఆకాశ రామన్న నేను) చత్తీస్ గడ్ బాధ్యురాలు నర్మదక్క అని తెలుసు” అని ప్రస్తావిస్తాడు. నర్మదక్క బాధ్యురాలు అని ప్రపంచానికి చెప్పాలా వద్దా అనే కనీస టెక్నికల్ వ్యవహారం పట్టించుకోకుండా రాసిన బాధ్యతారహితమైన ప్రకటన ఇది. నాకు తెలుసు అని ఏవో ఊహిస్తూ ఆరోపిస్తూ రాయడం మరో ఎత్తు.

కాంగ్రెస్, బీ జే పీ లాంటి పార్టీలలో బ్రాహ్మణీక ఎత్తుగడలు పచ్చిగా బయట పడుతాయి. ఈ విప్లవ రచయితల్లో చాలా ఫేషనబుల్ గా ఉంటాయి ఈ ధోరణులు. Acceptable form లోకి తీసుకొచ్చి విప్లవోద్యమం తో కాపురం చేస్తూనే దెబ్బ తీసే పరిణామం ఒకటి సృష్టించే పద్దతి ఇది.

మనం చెప్పాల్సింది చెప్పేసాం అని చేతులు ముడుచుకోవడం కూడా ఉత్తి ఉదారత్వం. మనకు చేతనైనప్పుడు – ఎంత బలంగా చెప్పాము అన్నది కూడా ముఖ్యం. ఎంత ప్రభావితంగా అరాచక బ్రాహ్మణీయతను మనం ప్రజల ముందు పెడుతున్నాము అనేది కూడా ముఖ్యం. అందుకే ఈ కార్టూన్ లు! వ్యక్తుల మీద ఆధారపడిన విప్లవోద్యమ ఆచరణను తప్పుపట్టే కార్టూన్ లు ! చాప కింద నీరులా పాకిన బ్రాహ్మణీయతను వేలు పెట్టి చూపించి ప్రశ్నించే కార్టూన్ లు !

 

 

– P Victor Vijay Kumar

One thought on “నిబద్దతే గీటురాయి

  1. ఇందులో ” అతడికి (ఆతడు అనే ఆకాశ రామన్న నేను) చత్తీస్ గడ్ బాధ్యురాలు నర్మదక్క అని తెలుసు” అని ప్రస్తావిస్తాడు. నర్మదక్క బాధ్యురాలు అని ప్రపంచానికి చెప్పాలా వద్దా అనే కనీస టెక్నికల్ వ్యవహారం పట్టించుకోకుండా రాసిన బాధ్యతారహితమైన ప్రకటన ఇది. నాకు తెలుసు అని ఏవో ఊహిస్తూ ఆరోపిస్తూ రాయడం మరో ఎత్తు.
    there is no limit to his imaginary capacities.he is in a firm belief that his word is final. if somebody tries even to correct factual errors also he doesn’t spare it.he can conveniently tries to mock at the critics by showing one or other concocted stories.recently he wrote an essay on srikakulam movement and i have corrected the factual errors. in his reply he tried brand me as i am related to one or other politics. unfortunately the editor has not published my rejoinder. i have sent it to Arunatara . they have also not published my letter. this is the new democracy they want to establish. it is not the question of mere brahminical it is an exhibition of gun culture in criticism.you have exposed this in cartoons in an excellent manner. thank you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)